Friday, April 19, 2024

రాష్ట్రంలో అకాల వర్షాలు.. రైతు కన్నీరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పంటనష్టానికి గురిచేస్తోంది. ఆరుగాలం శ్రమించిన రైతులను ఈ వర్షాలు ఆవేదనకు గురిచేశాయి. శనివారం పలుచోట్ల కురిసిన వర్షానికి రహదారులపై విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వడగాలులతో కూడిన వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసిముద్ద కాగా, మామిడి రైతులకు అపారనష్టం మిగిల్చింది. బొమ్మలరామారంలో భారీగా వడగండ్ల వాన కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం నేలపాలయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు.
0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి

మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, మరఠ్వాడ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రం ప్రాంతాల్లో సుమారుగా మే 13 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాత్రి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిమీ)ల వేగంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆది, సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిమీ) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం, ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుండి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Premature rains in Several Districts in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News