Home వరంగల్ భద్రకాళీ ఫైర్ వర్క్‌లో భారీ బాంబుల తయారీ.!

భద్రకాళీ ఫైర్ వర్క్‌లో భారీ బాంబుల తయారీ.!

 Preparation of heavy bombs in Bhadrakali fire work shop

మనతెలంగాణ/కాశిబుగ్గ : నగరంలోని కోటిలింగాల గుడి వద్ద గల భద్రకాళీ ఫైర్ వర్క్‌లో భారీ స్థాయిలో ఉండే బాంబులను తయారీ చేస్తున్నాట్లుగా విశ్వాసనీయ సమచారం. అయితే దీపావళీ బాంబులు మాత్రమే భద్రకాళీ ఫైర్ వర్క్‌లో తయారు చేస్తున్నాట్లుగా ప్రజలు అనుకునే విధంగా అక్కడా ఉండేంది. కానీ గత నాలుగు రోజుల క్రితం భద్రకాళీ ఫైర్ వర్క్‌లో భారీ పేలుళ్ల ఘటన తరువాత అనేక సంఘటాలను వెలుగు చూస్తున్నాయి. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా చేయడంతో పాటు సిసి కెమెరాలలో రికార్డు అయినా దృశ్యలను బట్టి బాంబుల పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెల్సే అవకాశం ఉందని పోలీసులు వర్గాలు అంటున్నారు. అయితే బాంబుల కుమార్ తయారు చేసే బాంబులలో జిలెటిన్ స్టిక్స్ తరహాలో మందును కల్పడం వల్లే బాంబుల శబ్ధం పెద్దగా వచ్చేందా…లేక ఎక్కువ మోతాదలల్లో బాంబులకు సంబంధించిన మందును కల్పండం వల్ల ఆ శబ్ధం పెద్దగా వచ్చేదా…అనే కోణాలల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నాట్లుగా తెల్సింది. మాములుగా టాపాసులు అయితే ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరిగే ఆవకాశం లేదు. పది మంది ప్రాణాలు పోయి ఉండేంది కాదు. ఘోరమైన అగ్నిప్రమాదం జరిగి ఉండంక పోవచ్చు. భద్రకాళీ ఫైర్ వర్క్‌లో తయారీ అవుతున్న ప్రతి బాంబుకు ఒక్క ప్రత్యేకత ఉందా అంటే..మాములు విషయం కాదు.

* ఇంకా చేరని మృతుదేహాలు
వరంగల్ కోటిలింగాల గుడి వద్ద భద్రకాళీ ఫైర్ వర్క్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతి చెందిన పది మందిలో కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్, కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేశ్‌ల మృతుదేహాలను శరీరభాగాలు ముక్కలు ముక్కలుగా మారడంతో వాటిని గుర్తు పట్టని విధాంగా ఉన్నాయిని వారి ఇద్దరి మాంసం ముద్దలను డిఎన్‌ఎ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. అయితే ఇంకా రాకపోవడంతో రాకేశ్, మల్లికార్జున్ కుటుంబ సభ్యులు వారి మృతుదేహాల కోసం ఎదురు చూస్తున్నారు.