Home తాజా వార్తలు పరిహారం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం

పరిహారం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం

 compensation

 

కూడుపోయే.. గూడు పోయే…. పురుగుల మందే దిక్కాయే..!
మల్లేపల్లి ఓసి భూనిర్వాసితుని ఆందోళన
అధికారులు మారినా అందని పరిహారం
నిర్వాసితులకు పరిహారం అందని ద్రాక్షేనా?

మణుగూరు : కూడుపోయే.. గూడు పోయే…. పురుగుల మందే దిక్కాయే…. అన్నట్లు ఉంది మల్లేపల్లి ఓసి భూనిర్వాసితుల పరిస్థ్ధితి. మల్లేపల్లి ఒకప్పుడు పచ్చని పొలాలు, పాడిగేదెలు, గోదావరి అందాలతో కలకలలాడేది. కాలక్రమేణా బొగ్గుబావుల విస్తరణలో బాగంగా మల్లేపల్లి ప్రాంతం ఉపరితల గనిగా మారింది. నాటి రైతులు నేడు భూనిర్వాసితులుగా మారి, వాటి పరిహరం కోసం అనేక సంవత్సరాలుగా నిరిక్షిస్తున్నారు. అధికారులు మారుతున్న వారి సమస్యలు మాత్రం మారడంలేదు. గతంలో సింగరేణిలో పనిచేసిన ఓ అధికారి చేసిన నిర్లక్షం కారణంగా నేడు పదుల సంఖ్యలో నిర్వాసితులు వారి భూములకు పరిహారం అందక అధికారులు చూట్టు కాళ్ళు అరిగేలా తిరిగిన ఫలితం మాత్రం శూన్యమే.

గతంలో మల్లేపల్లి ఓసి నిర్వాసితులు పలుమార్లు గనుల్లో అందోళన చేసి ఓసి పనులు అడ్డుకోని చివరికి అధికారులు ఆగడాలు తట్టుకోలేక ఓభూనిర్వాసితుడు గని ఆవరణలో ఆత్మహత్యయత్నం చేసుకోగా కదిలిన జిల్లా యంత్రాంగం తూతుమంత్రంగా కోంతమంది రైతులకు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. బుధవారం కోమ్ముగూడెం గ్రామానికి చేందిన సున్నం బాబురావు అనే యువకుడు సింగరేణి అధికారులు తమకి రావాల్సిన ఇంటి పరిహారం చెల్లించకుండ తమ ఇంటిని కూల్చివేశారని పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

దీనికి సంభందించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మణుగూరు మండల పరిదిలోని కోమ్ముగూడెం గ్రామానికి చేందిన సున్నం బజారయ్య అనే భూనిర్వాసితుడిని సింగరేణి భూనిర్వాసితుడిగా పేర్కోని అతడిని సూచిక1 ద్వారా ప్రకటించి వారికి పరిహారం చెల్లించేందుకు క్రమ సంఖ్య 9గా ప్రకటించారు. అనంతరం వారికి పునరావాసం క్రింద కొత్తకొండాపురం గ్రామంలో వారికి 5సెంట్ల ఇంటి స్ద్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా వారు ఇళ్ళు నిర్మించేందుకు సుమారు 5లక్షల 4వేల రుపాయాల చెక్కును సైతం మంజూరీ చేశారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా సున్నం బజారయ్య మృతి చెందగా ఆయన బార్య అయిన సున్నం నర్సమ్మ చెక్కు మంజురీ చేశారు.

అధికారులు, మరియు అప్పట్లో పనిచేసిన మల్లేపల్లి ఏరియా ఎస్టేట్ అధికారి చెక్కు మంజూరీలో జాప్యం చేయడంతో సున్నం నర్సమ్మ కూడా మృతి చెందిందని తమ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందారని, గతంలో సింగరేణి అధికారులు తమ ఇంటిని కూల్చేందుకు పలుమార్లు ప్రయత్నించిన పరిహారం చేల్లించేవరకు ఇంటిని కూల్చే ప్రసక్తే లేదని ఆందోళన చేయడంతో అధికారులు వెనక్కి తగ్గారని, నేడు తమకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా తమ ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.

గతంలో ఎస్టేట్ అధికారి మీకు పరిహారం చెల్లించమని, మీరు రెవెన్యూ అధికారులను సంప్రదించమని తెలిపారని, ఇప్పటికి అనేక మంది ఆర్‌డిఓలు, తహసీల్దార్‌లు మారారుకానీ తమకు రావాల్సిన పరిహారం మాత్రం చెల్లించడంలేదని తమకు చావే దిక్కని తమ కుటుంబం సింగరేణి అధికారుల నిర్లక్షంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మల్లేపల్లి ఓసి ప్రాజెక్ట్ అధికారి లలిత్ కుమార్ తమ ఇంటికి సంభందించిన ప్యాకేజి అధికారులతో మాట్లాడి అందిస్తామని హమీ ఇవ్వడంతో తమ ఆందోళన విరమించారు.

Prepare a life sacrificial offering for compensation