Home సిద్దిపేట సిద్దిపేటలో గృహ ప్రవేశాలకు డబుల్ ఇడ్లు సిద్ధం

సిద్దిపేటలో గృహ ప్రవేశాలకు డబుల్ ఇడ్లు సిద్ధం

Prepare double-beds for home entrances in Siddipet

లబ్ధిదారుల ఎంపిక లో ప్రజాప్రతినిధు లు జోక్యం చేసుకో కూడదు
జూలై 15 సిద్దిపేట లో మిషన్ భగీరథ పైలాన్ ప్రారంభం
సమీక్షలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

మన తెలంగాణ/సిద్దిపేట : దేశంలోనే ఆదర్శ వంతంగా సిద్దిపేటలో నిర్మించిన జీప్లస్ టూ డబుల్ బెడ్ రూం ఇండ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని రా ష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రామారెడ్డి తో కలిసి ఆయన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏజెన్సీల వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఎంపిక బా ధ్యత కలెక్టర్‌దేనన్నారు. జూలై నెలాఖరులోపు లబ్ధిదారు ల ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇం దులో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకూడదన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలో జూలై, ఆగస్టు నెలలో ప్రా రంభోత్సవాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను సిద్ధం చేయాలన్నారు. చింత మడక గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామంలో వారం రోజుల్లో గృహ ప్రవేశా లు చేయడంతో పాటు మాటిండ్ల, గుర్రాల గొంది, చంద్లాపూర్, ఆల్లీపూర్, చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాలలో ఆగస్టు మాసంలో ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నంగునూరు మండలంలో జూలై 15వ తేది వరకు పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చే యాలన్నారు. అన్ని మండలాలకు చెందిన ఎంపీడీవోలు ఆయా గ్రామాలలో జరిగే డబుల్ బెడ్‌రూం నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏజెన్సీల వారు సమన్వయంతో పని చేసి డబల్ బెడ్‌రూం ఇండ్ల పనులను వేగవంతం చేయాలన్నారు.

జూలై 15న సిద్దిపేట భగీరథ పైలాన్ ప్రారంభం : రాష్ట్రంలోనే మిషన్ భగీరథ పథకం పూర్తి చేసిన తొలి జిల్లాగా సిద్దిపేటను ప్రకటించనున్న సందర్భంగా జూలై నెల 15న పట్టణంలోని కోమటి చెరువు వద్ద మిషన్ భగిరథ పైలాన్‌ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జూలై 10వ తేదీ లోపు జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులను పూర్తి చేయాలని డబ్లూఎస్ అధికారులకు అదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహె డ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్సాబాద్ మండలాలలో ఫైప్‌లైన్‌ల లీకేజీలు పనులు చేపట్టాలన్నారు. ప్రతి నెల మహిళా వీవోలతో సమావేశం నిర్వహించి నీటి వృధా కా కుండా అవగాహన కల్పించాలన్నారు. 30వ తేదీన జిల్లా కలెక్టర్ మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహిస్తారన్నారు.

జూలై నెలాఖరులో యూడీసీ తొలి ఫలితం : సిద్దిపేట పట్టణంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తొలి ఫలితం జులై నెలాఖరులో అందనుందని మంత్రి తన్నరు హరీశ్‌రావు తెలిపారు. చింతల్ చెరువు వద్ద చేపడుతున్న ఎస్‌టీపీ, సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో 90 కిలో మీటర్లకు 70 కిలో మీటర్లు యూడీసీ పనులు పూర్తయినట్లు తెలిపారు. పట్టణంలో మొత్తం 324 కిలో మీటర్లకు గాను 94 కిలో మీటర్లు పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జాయిం ట్ కలెక్టర్ పద్మాకర్ , వివిధ శాఖల అధికారులు కర్ణాకర్‌బాబు, రాజశేఖర్‌రెడ్డి, వేణు, ప్రజాప్రతినిధులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవిందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, రాగుల సారయ్య పాల్గొన్నారు.