Home మహబూబ్‌నగర్ నాడు జలచర్ల.. నేడు జడ్చర్ల

నాడు జలచర్ల.. నేడు జడ్చర్ల

jadcherlaజడ్చర్ల రూరల్:  జడ్చర్ల గ్రామం పంచాయతీని నాడు జలచర్లగా ఇప్పుడు జడ్చర్లగా పిలుస్తున్నారు. జలచర్లగా పేరు ఉన్న గ్రామాన్ని రానురాను జడ్చర్లగా మారింది. జడ్చర్ల గ్రామం మొదట ఇప్పుడున్న శంకరాయపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొంగరాల తిప్పలో గ్రామం ఉండేదని అక్కడ వందేళ్ల క్రితం ప్లేగు వ్యాధి(గత్తర) సోకి గ్రామస్తులు చనిపోతుండటంతో అక్కడి నుండి ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియాకు వచ్చారని కొన్నేళ్ల తర్వాత అక్కడ కూడా ప్లేగువ్యాధి సోకడంతో అక్కడి నుండి ఇప్పుడు ఉన్న జడ్చర్లకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే జడ్చర్ల కింది బాగంలో వెంకటేశ్వర దేవాలయం దగ్గర ఉన్న ఊరచెరువు పెద్దదిగా ఉండేదని ఆనీరు గ్రామంలోకి వచ్చేదని అదీను గాక జడ్చర్ల పైబాగంలో నల్లచెరువు నీళ్లు కూడా గ్రామ సమీపంలో కి వచ్చేవని దాంతో రెండు చెరువుల మద్య గ్రామం ఉండటంతో దానిని జలచర్లగా పిలిచేవారని రానురాను దాని పేరు జడ్చర్లగా మారింది.
జడ్చర్లకు పదిమంది సర్పంచ్‌లు
జడ్చర్ల(కావేరమ్మపేట) గ్రామపంచాయతీకి ఇప్పటి వరకూ 10మంది సర్పంచులు తమ పాలనను కొనసాగించారు. జడ్చర్ల గ్రామ పంచాయితీ 1956లో ఏర్పడింది. అప్పుడు కావేరమ్మపేటకు చెందిన రామేశ్వరరావు మొట్టమొదటి సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన దాదాపు 11 సంవత్సరములు ఉన్నారు. ఆయన అనంతరం జరిగిన ఎన్నికలలో చాకలి లక్ష్మయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. లక్ష్మయ్య మూడు సంవత్సరములు సర్పంచ్‌గా విధులు నిర్వర్థించారు. ఆయన తీవ్రఅస్వస్తతతో మృతి చెందడంతో ఉపసర్పంచ్‌గా ఉన్న పోల క్రిష్ణయ్య ంచార్జి సర్పంచ్‌గా కొనసాగారు. ఆత ర్వాత ఎన్నికలు జరగక పోవడంతో క్రిష్ణయ్య దాదాపు 10సంవత్సరములు సర్పంచ్‌గా కొనసాగారు. అనంతరం 1982లో జరిగిన ఎన్నికలలో టీడీపి పార్టీకి చెందిన వెంకట్‌రెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన 5ఏళ్లపాటు 1982నుంచి 1987వరకు సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన పోలపాండరంగయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కోన్నాళ్ల తర్వాత పాండురంగయ్యకు కాలికి గాయం కావడంతో రెండు నెలల పాటు ఉపసర్పంచ్‌గా ఉన్న ప్రసంగి ఇంచార్జి సర్పంచ్‌గా ఉన్నారు. తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నిత్యానందం సర్పంచ్‌గా ఉన్నారు. నిత్యానందం బీసీ కాదని టీడీపికిచెందిన చింతకాయల పెంటయ్య కోరక్టుకు వెళ్లడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు చింతకాయల పెంటయ్య సర్పంచ్‌గా 9లలపాటు ఉన్నారు. 9నెలల అనంతరం తిరిగి నిత్యానందం సర్పంచ్‌గా కొనసాగారు. ఆతర్వాత జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొగళిలలితమ్మ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006లో జరిగిన ఎన్నికలలో టీడీపికి చెందిన చింతకాయల పెంటయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.