Friday, March 29, 2024

సోషల్ మీడియాపై ట్రంప్ ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

President-Donald

వాషింగ్టన్: వినియోగదారులు పోస్ట్ చేసిన సమాచారంపై సోషల్ మీడియాకున్న ఫ్యాక్ట్ చెక్ అధికారాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల ట్రంప్ ట్వీట్ చేసిన రెండు పోస్టులకు ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్‌ను జోడించిన నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా కంపెనీలకున్న ఫ్యాక్ట్ చెక్ అధికారాన్ని తొలగిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలను ట్రంప్ జారీ చేశారు. సమాచార చట్టంలోని 230 సెక్షన్‌లోని నిబంధనలను మారుస్తూ ట్రంప్ ఈ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కల్పించే ఆదేశాలను తా ను జారీ చేశానన్నారు. సోషల్ మీడియా దిగ్గజాలు తటస్థ వేదికలుగా చెప్పుకుంటూ వినియోగదారుల అభిప్రాయాలను ఎడిట్ చేయడం సరైంది కాదన్నారు.

అమెరికాలోని మెజారిటీ ప్రజల అభిప్రాయాల్ని కొన్ని సోషల్ మీడియా సంస్థలు నియంత్రిస్తున్నాయని ట్రంప్ పరోక్షంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను ఉద్దేశించి అన్నారు. మనకు తెలుసు అవేమి టో, వాటి పేర్లు ప్రస్తావించ దలచుకోలేదు అంటూ ముక్తాయించారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో దేనిని తిరస్కరించాలో, దేనిని ప్రోత్సహించాలో సోషల్ మీడియా తమ చేతుల్లోకి తీసుకోవడమనేది రాజకీయ కార్యాచరణకన్నా ఎక్కువేనని ట్రంప్ విమర్శించారు. ఈ విధమైన సెన్సార్‌షిప్ అధికారం స్వేచ్ఛపై దాడిలాంటిదేనని ట్రంప్ అన్నారు. అమెరికాలో పత్రికలు, ఇతర సమాచార వ్యవస్థలకంటే సోషల్ మీడియా కంపెనీలు శక్తిమంతంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు.

1996 చట్టం ప్రకారం వినియోగదారులు పోస్ట్ చేసిన సమాచారానికి వెబ్‌సైట్ నిర్వాహకులు బాధ్యత వహించరు. హింసను ప్రోత్సహించేలా లేదా అభ్యంతరకరంగా ఉన్నాయన్న కారణంతో పోస్టుల్ని బ్లాక్ చేసే అధికారం కూడా పాత చట్టం ప్రకారం నిర్వాహకులకున్నది. ఇప్పుడు ట్రంప్ జారీ చేసిన ఆదేశాలతో నిర్వాహకులకు ఆ అధికారముండదు. వెబ్‌సైట్లలో పేర్కొన్న సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల పోస్టుల్ని తొలగిస్తే, దానిని మోసపూరిత చర్యగా నిర్వాహకులపై కేసులు నమోదు చేసేందుకు ట్రంప్ ఆదేశాలు వీలు కల్పించాయి.

President Donald Trump Vs Social Media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News