Thursday, March 28, 2024

నూతన వలస విధానానికి బైడెన్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

President Joe Biden signs immigration policies

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటి నిపుణులకు మేలు చేసే నూతన వలస విధనాన్ని అమెరికా అధ్యక్షడు జో బైడన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జో బిడెన్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది “న్యాయమైన, క్రమమైన, మానవత్వంతో కూడిన” చట్టపరమైన ఇమిగ్రేషన్ వ్యవస్థకు దారి తీస్తుందని, పిల్లలను వారి కుటుంబాల నుండి విడదీసిన డొనాల్డ్ ట్రంప్ కఠినమైన విధానాలను కూడా రద్దు చేస్తానని చెప్పారు. “నేను కొత్త చట్టం చేయటం లేదు, నేను చెడు విధానాన్ని తొలగిస్తున్నాను” అని బిడెన్ వైట్ హౌస్ లో చెప్పారు. మొదటి విధానం ప్రకారం సరిహద్దుల్లో కుటుంబాలకు దూరమైన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రులకు చేరువ చేసేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయనున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయంలో తమ పిల్లలను దూరం చేసుకున్న 5,500 కుటుంబాలకు వారి పిల్లలను చేరువచేసే దశలో స్పెషల్ టీమ్ పనిచేయనుందన్నారు.

రెండవ ఉత్తర్వు ప్రకారం సరిహద్దు ద్వారా వలస వచ్చే వారికి ఆశ్రయం కల్పించే విధానం రూపొందించే సహా వరస నిరోధక చర్యలు నిలిపివేయనున్నారు. ఈ ఉత్తర్వు  ముఖ్యంగా మెక్సికో నుంచి వచ్చే వారికి లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. మూడో ఉత్తర్వు ప్రకారం గత ప్రభుత్వం తీసుకొచ్చిన వలసల విధానాన్ని సమీక్షించి సురక్షితమైన, పారదర్శక వలస విధానం రూపకల్పనను రూపొందించాలని బైడెన్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమెరికాలో వలస విధానాన్ని పటిష్ఠం చేయడమే కాకుండా మానవత్వంతో కూడిన వలస విధానానికి నాంది పలుకుతుందని బైడెన్ స్పష్టం చేశారు. “ఇది న్యాయమైన, క్రమమైన, మానవత్వంతో కూడిన చట్టపరమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు అమెరికా సురక్షితమైన, బలంగా, సంపన్నంగా ఉంటుంది” అని బిడెన్ విలేకరులతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News