Friday, April 26, 2024

అథ్లెట్లకు క్రీడా పురస్కారాలు ప్రదానం

- Advertisement -
- Advertisement -

పర్చువల్ విధానంలో అవార్డులు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రీడాకారులకు క్రీడా పురస్కారాలు అందజేశారు. ప్రతిసారి ఢిల్లీలోని కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) కార్యాలయంలో క్రీడాకారులకు స్పోర్ట్ పురస్కారాలు అందజేయడం అనవాయితీ. అయితే ఈసారి కరోనా వల్ల అలా ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో ఈసారి పర్చువల్ విధానంలో క్రీడా పురస్కారాలను అందజేయడం జరిగింది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 29న క్రీడల్లో ప్రావీణ్యం కనబరిచే క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. ఈసారి రికార్డు స్థాయిలో ఐదుగురు క్రీడాకారులకు క్రీడల్లో అత్యున్నతమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రకటించారు. క్రికెటర్ రోహిత్ శర్మ, మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్, మహిళా హాజీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, మనికా బాత్రా(టిటి), పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈసారి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించారు. కాగా, రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపిఎల్ కోసం దుబాయి వెళ్లాడు. మరోవైపు రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కరోనా సోకింది. దీంతో వీరిద్దరు శనివారం పురస్కారాన్ని స్వీకరించలేక పోయారు. అంతేగాక అర్జున అవార్డు దక్కించుకున్న ఇషాంత్ శర్మ కూడా ఈ పురస్కారాన్ని తర్వాత స్వీకరించనున్నాడు.

ఇక స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ కూడా కరోనా బారిన పడడంతో శనివారం అర్జున అవార్డును తీసుకోలేక పోయాడు. అతనికి కూడా తర్వాత ఈ పురస్కారాన్ని అందజేస్తారు. కాగా, క్రీడల్లో అద్భుత ప్రతిభను కనబరిచిన అథ్లెట్లను అత్యున్నత క్రీడా పురస్కారాలను ప్రకటించారు. ఖేల్ రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య పురస్కారాలను ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చండీగఢ్, పుణె, సోనెపట్, బెంగళూరు, హైదరాబాద్, భోపాల్ నగరాల్లోని సాయ్ కేంద్రాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు పురస్కారాలను అందజేశారు. పర్చువల్ విధానంలో క్రీడాకారులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రధానం చేశారు. కాగా, ఈ ఏడాది మొత్తం ఐదుగురికి క్రీడల్లో అత్యున్నతమైన ఖేల్త్న్ర అవార్డును అందజేశారు.

President Kovind presented Sports awards to athletes

అంతేగాక మొత్తం 27 మంది క్రీడాకారులకు రెండో అత్యున్నత పురస్కారం అర్జున అవార్డును ప్రకటించారు. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టిటి, షూటింగ్, గోల్ఫ్, ఖోఖో, రోయింగ్ తదితర క్రీడాంశాల్లో ప్రతిభను కనబరిచిన వారికి అర్జున అవార్డుతో సత్కరించారు. ఇషాంత్ శర్మ (క్రికెట్), సాయి ప్రణీత్ (బ్యాడ్మింటన్), ఆకాశ్ దీప్ సింగ్ (హాకీ), దివిజ్ శరణ్ (టెన్నిస్), దీప్తి శర్మ (క్రికెట్), మీరాబాయి (వెయిట్‌లిఫ్టింగ్) తదితరులు అర్జున అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. జూడ్ ఫెలెక్స్ (హాకీ), యోగేశ్ (మల్లాఖంబ్), జస్పాల్ రాణా (షూటింగ్), కుల్దీప్ కుమార్ (వుషు) తదితరులకు ద్రోణాచార్య (రెగ్యూలర్) పురస్కారాలు లభించాయి. కుల్దీప్ సింగ్, తృప్తి మురుగుండే, ఉష (బాక్సింగ్), అజిత్ సింగ్ (హాకీ) తదితరులకు ధ్యాన్‌చంద్ అవార్డులు దక్కాయి.

President Kovind presented Sports awards to athletes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News