Sunday, June 22, 2025

రాష్ట్రపతి, గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు?

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టును నిలదీసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో
ఎలాంటి నిబంధన లేనప్పుడు మీరు ఎలా ఆదేశిస్తారు?
సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించిన రాష్ట్రపతి ఆర్టికల్
143(1) కింద సందేహాలు వ్యక్తం చేసిన ముర్ము
వీటిపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్న సిజెఐ

న్యూఢిల్లీ:పెండింగ్ బిల్లుల ఆమోదం విషయంలో తుదిగడువులు విధిస్తూ సుప్రీంకో ర్టు వెలువరించిన రూలింగ్‌పై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడు స్పందించారు. రాష్ట్రాలు పంపించే బిల్లులపై కాలాయాపన కుదరదని సుప్రీంకోర్టు రాష్ట్రపతిని, గవర్నర్ల ను ఆదేశించవచ్చా? రాజ్యాంగంలో ఈ వి ధంగా చేయవచ్చునని ఏ ఆర్థికల్ ఏ నిబంధ న చెపుతోందని ప్రశ్నించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో తమ స్పందన వెలువరించారు. తమ వద్దకు ఆమోదానికి వచ్చే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్లు కా నీ అసాధారణ రీతిలో తొక్కిపెట్టరాదని, వీటి ఆమోదానికి కాల పరిమితి ఖరారు చేసుకు ని తీరాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొన డం భారత రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల కు దింపు యత్నంగా కేంద్రం విమర్శించింది. ఇది రాజ్యాంగ అధినేత అధికారాల కోతకు దారితీస్తుంది. పైగా వ్యవస్థల మధ్య అధికార వినిమయం విషయంలో ఉండే లక్షణరేఖలను దాటివేసినట్లు అవుతుందని ఆక్షేపించారు . ఈ దశలో రాష్ట్రపతి ద్వారా సు ప్రీంకోర్టుకు పలు అంశాల ప్రస్తావనతో కూ డిన లేఖ అందింది.

రాజ్యాంగం ప్రకారం త మకు ఉండే అత్యంత అసారణ 143(1) అధికరణను వినియోగించుకుంటూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు తమ నుంచి నిరసన వం టి లేఖను పంపించారు. ఏదైనా విషయంలో చట్టపరమైన సందేహాం తలెత్తితో , వివరణ కావాలనుకుంటే రాష్ట్రపతి ఈ సంబంధిత ఆర్టికల్ వాడుకుని సుప్రింకోర్టుకు వారి అభిప్రాయం కోసం లేఖపంపించవచ్చు . లేదా నిరసన తెలియచేయవచ్చు. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వ ఆమోదిత బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం , రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర రాకపోవడం తీవ్ర వివాదం అయ్యి, విషయం చివరికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. గడువు విధించచ్చుననే నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు సంబంధిత తీర్పు వెలువరించడం ఎంతవరకు సబబు అని రాష్ట్రపతి నిరసన వ్యక్తం చేసినట్లు , ఈ స్పందన దేశ ప్రధమ పౌరురాలు నుంచి ఇటీవలే వ్యక్తం అయినట్లు వెల్లడైంది. తాజాగా రాష్ట్రపతి స్పందన విషయంలో తదుపరి పరిశీలనకు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

రాష్ట్రపతి సంధించిన 14 కీలక ప్రశ్నలు ఇవే
1గవర్నరకు బిల్లు వచ్చినప్పుడు తీసుకోవల్సిన నిర్ణయంపై రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలు ఏమిటీ? 2 మంత్రి మండలి సిఫార్సుల ఆమోదం వెంటనే చేయాల్సి ఉంటుందా?లేక ఆర్టికల్ 200 పరిధిలో దక్కే రాజ్యాంగ మార్గాలను వినియోగించకునే వీలు ఉండదా? 3 ఆర్టికల్200 పరిధిలో గవర్నర్లు బిల్లుల విషయంలో తమ రాజ్యాంగపరమైన అధికారం వినియోగించుకోవడం న్యాయబద్ధమా కాదా? 4 గవర్నరు చర్యలను జుడిషియల్ సమీక్ష ద్వారా మార్చేందుకు రాజ్యాంగపరంగా అవకాశం ఉందా? 5 గవర్నర్లు కాల పరిమితిలోగానే బిల్లుల ఆమోదం తెలియచేయాలనే నిర్థిష్ట నిబంధన లేనప్పుడు సంబంధిత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించడానికి వీలుంటుందా? 6 వివాదాస్పద సంబంధిత విషయంలో రాష్ట్రపతి తమకు ఉండే 201 అధికరణను వాడుకునేందుకు వీలులేదా? 7 బిల్లులు సంబంధించి గవర్నర్లు, రాష్ట్రపతికి నిర్ణీతమైన రాజ్యాంగ అవకాశాలు ఉన్నప్పుడు వాటి గురించి సుప్రీంకోర్టు అభిప్రాయాలు తీసుకోవల్సిన అవసరం ఉంటుందా? 8కొన్ని బిల్లుల విషయంలో గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఆమోదం నిలిపివేత జరిగినప్పుడు వారు సంబంధిత రాజ్యాంగ ఆర్టికల్ అధికారాలను వాడుకున్నప్పుడు,

ఈ ఏర్పాటును న్యాయవ్యవస్థ సమీక్షించడానికి వీలుంటుందా?
9బిల్లుల విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి ఉండే అధికారాలను రాజ్యాంగంలోని ఏ నిబంధనల మేరకు మార్చడానికి వీలుంటుంది? అసలు మార్చడానికి వీలుందా? 10 రాజ్యాంగ ప్రతినిధుల ఆమోదాలు లేకుండా చట్టసభల్లో ఆమోదిత బిల్లు ఉనికికి రావచ్చా? 11 రాజ్యాంగ అధినేతల అధికార ప్రస్తావన లేదా సవాలు పరిధిలోకి వచ్చే విషయాను సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో విచారిస్తుంది? ఏ అధికారంతో రూలింగ్ ఇస్తుంది? 12 రాష్ట్రపతికి ఆదేశాలు వెలువరించేలా చేసే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయా? ఉంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పరిధిలో దీనిని పేర్కొన్నారు? తెలియచేస్తారా? 13 బిల్లుల విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తితే సుప్రీంకోర్టు కలుగచేసుకునే సందర్భాలలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటి? 14ఏమైనా బిల్లులు చట్టసభల ఆమోదం పొందినప్పటికీ అవి కొన్ని కారణాలతో వీటిని ఆమోదించే విషయంలో కేంద్రం తరఫున గవర్నర్లు వీటిని నిలిపివేయవచ్చా? ఈ విషయంలో రాష్ట్రపతికి తెలియచేస్తే తప్పు ఉంటుందా? ఈ విషయంలో సుప్రీం స్పందన అవసరం అధికారానికి వీలుంటుందా? తమిళనాడు గవర్నర్ ఎన్ రవిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం విచారణల క్రమంలో ఎప్రిల్ 8వ తేదీన వెలువడ్డ సుప్రీంకోర్టు తీర్పు రాష్టపతికి , గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో ఉండే సంపూర్ణ అధికారాలపై పలు ధర్మసందేహాలు వ్యక్తపర్చే రీతిలో ఉన్నాయి. ఇప్పుడు సంబంధిత విషయంలో సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నలు సంచలనానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News