Home జాతీయ వార్తలు చర్చలా, రచ్చలా?

చర్చలా, రచ్చలా?

ప్రజాస్వామ్య వృక్షం ఆకులు వాడిపోతున్నాయి
ఆత్మ పరిశీలన చేసుకోవాలి లోపలి నుంచేదిద్దుబాటు జరగాలి

పార్లమెంట్ సమావేశాల తీరుపై Pranab_manatelanganaస్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ఆవేదన

పార్లమెంట్ సమావేశాల తీరుపై పంద్రాగస్టు   ఆవేదన   

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య పట్టుగొమ్మ అయిన పార్లమెంట్‌లో విలువల పతనం ఆందోళనకరం అని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ చర్చలకు బదులు దాడుల దశకు చేరు కుందని, ప్రజాస్వామిక సంస్థలు ఒత్తిళ్లకు లోనవుతు న్నాయని, దిద్దుబాటు చర్యలు అంతర్ముఖంగానే చోటుచేసుకోవాలని ఆయన ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. 69వ భారత స్వాతంత్య్ర దినో త్సవం (పంద్రాగస్టు) సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఆయన ప్రధానంగా పార్లమెంట్ ప్రమాణాలనే ప్రస్తావిం చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రసాభాస ముగింపు నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్య తను సంతరించుకున్నాయి. ప్రజాస్వామిక సంస్థలు, వ్యవస్థలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న దశలో ప్రజలు, వారు ఎన్నుకున్న పార్టీలు ఈ పరి ణామం గురించి తీవ్రస్థాయిలో ఆలోచించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. పార్లమెంట్‌లో సామరస్య, నిర్మాణాత్మక చర్చల దశ క్షీణించిపోతోందని, దాని కి బదులుగా ఇప్పుడు సంఘర్షణాత్మక రాజకీయా లు సభలోకి ప్రవేశిస్తున్నాయని, ఇది అనుచితమని తెలిపారు. అయితే ప్రజాస్వామ్యపు వేళ్లు ప్రగాఢంగా ఉన్నాయని, లోతుల వరకూ విస్తరించుకున్నాయని, కానీ ఇప్పటి పరిణామాలలో పైన ఉండే ఆకులు వాడిపోతున్నాయని, అవి తిరిగి హరితాన్ని పుంజు కోవాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా మనం స్పందించ కపోతే, మన రాబోయే తరాల వారు మనను గౌరవప్రదంగా స్మరించుకుంటారా? మెచ్చుకుం టారా? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి.

1947లో ఓ ఘనమైన భారతీయ స్వప్నాన్ని సాకారం చేసిన వారిని మనం గుర్తుంచుకుంటున్న ట్లుగా భావితరం మనను స్మరించుకుంటుందా? మరో ఏడు దశాబ్దాల తరువాత చర్రితలో మన స్థానం ఏమిటీ? అనేది ఒక్కసారి పరిశీలించుకోవా లని కోరారు. అత్యంత ఉద్వేగభరితంగా, ఆలోచనా పథంగా రాష్ట్రపతి జాతికి ఇచ్చిన సందేశంలో వర్తమాన రాజకీయ నేతల తీరు పట్ల పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజ్యాంగం మనకు అమూల్యమైన ప్రజాస్వామిక ప్రక్రియను కానుకగా ఇచ్చింది. ఈ ఆదర్శప్రాయమైన మౌలిక వ్యవస్థలోనే మన సంస్థలు ఇమిడి ఉన్నాయి. వాటి పరిరక్షణ అనేదే మనకు సంక్రమించే అత్యుత్తమ వారసత్వ సంపద. అయితే ఇప్పుడు ప్రజాస్వామిక సంస్థలు ఒడుదుడుకులకు గురవుతున్నాయి. పార్లమెంట్ ఘర్షణకు తావు అవుతోంది, చర్చల ప్రక్రియకు గండిపడింది. ఇది బాధాకరం. మన ప్రజాస్వామ్యం అత్యంత సృజనాత్మకం. అందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చే సందేశం ఉంది. భిన్నత్వంలో ఏకత్వా న్ని మనం పరస్పర సహనం, ఓపికతో సాధించు కోవచ్చు. సామాజిక సామరస్యానికి ఇదే మూలం. మనం ఇప్పుడు అతివేగపు సమాచార వినిమయ దశలో ఇంతకు ముందెన్నడూ లేనంతటి సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాం. ఈ దశలో మనం అత్యంత జాగరూకతతో ఉండాలి. కొందరి విచ్ఛిన్నకర ధోర ణులు మన ప్రజల నిత్యావసర ఏకత్వాన్ని దెబ్బ తీయరాదు. దేశంలో చట్టం అతి పవిత్రం. ప్రభుత్వా నికి , ప్రజలకు అందరికీ ఇది సమానం. చట్టాన్ని అంతా పరిరక్షించుకోవాలి. అయితే సమాజం చట్టం కన్నా ఉన్నతమైన మానవతతో పరిరక్షించుకోవాలి. మానవత అందరికి శిరోధార్యం కావాలి. మానవత్వంపై విశ్వాసం సడలిపోరాదని, మానవత సముద్రం వంటిదని, సముద్రంలో కొన్ని బిందు వులు మురికిగా ఉంటే, సముద్రమంతా కలుషితం అనుకోరాదని మహాత్మా గాంధీ చెప్పారు. దీనిని అంతా గుర్తుంచుకోవాలి. వ్యవస్థకు ఉన్న ప్రాధా న్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏ దేశ ప్రగ తిని అయినా దేశ విలువల బలాన్ని బట్టి అంచనా వేసుకుంటారు. అదే విధంగా దేశ ఆర్థిక ప్రగతి కూడా లెక్కలోకి వస్తుంది. అయితే ఇదే క్రమంలో జాతీయ వనరులు సమత్యులతో పంపిణీ అయి, ఫలాలు సమానంగా అందరికీ అందాల్సి ఉంది.
సంపన్నుల ఖాతాలు పెరగడం ప్రగతి కానేరదు
దశాబ్దంగా వృద్ధిరేటు తగ్గుతూ వచ్చినా, 2014-15లో ఇది పుంజుకుని 7.3 శాతానికి చేరిందని, అయితే ఈ ప్రయోజనాలు , వృద్ధిరేటు ఫలితాలు సమాజంలోని కడు పేదలకు, అణగారిన వర్గాలకు కూడా చేరాల్సి ఉందని , అత్యంత సంపన్నుల ఖాతాలు పెరిగేవిధంగా ఈ ఫలితాలు చేరడానికి ముందే నిరుపేదలకు మేలు జరిగితే ప్రగతికి సార్థకత ఉంటుందని రాష్ట్రపతి తెలిపారు. మనది సమ్మిళిత ప్రజాస్వామ్యం అని, సమ్మిళిత ఆర్థిక రంగాన్ని సంతరించుకుని ఉన్నామని, సంపద కూడా సమ్మిళితం ఫలిత దిశలో అందాల్సి ఉంటుం దని చెప్పారు. మన సంపద పంపిణీలో తొలిపిలుపు నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అందాల్సి ఉందని సూచించారు. ఆకలి లేని దేశాన్ని సాధించుకునే దశకు చేరాలని పిలుపు నిచ్చారు. ఆర్థిక రంగం ఆశాజనకంగా ఉందని, భవిష్యత్తులో ఇంకా బాగుం టుందనే సూచనలు ఉన్నాయని భారతీయ ఇతి హాసంలో ప్రగతి అధ్యాయం లిఖించుకోవల్సి ఉంద న్నారు. ఆర్థిక సంస్కరణలు పురోగమన దిశలో ఉన్నాయని తెలిపారు.
భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యాసంస్థలు
భారతదేశంలో విలువైన గురు శిష్య పరంపర ఉంది. ఇది గర్వకారణంగా నిలిచింది. అయితే ఈ అనుబంధం ఇప్పుడు ఎంతవరకు ఉందనే ప్రశ్న వస్తోంది. విద్యార్థి అంకితభావంతో, గురువు పట్ల కృతజ్ఞతతో వ్యవహరించి గురువు రుణం తీర్చుకునే విధంగా వ్యవహరించాల్సి ఉందని రాష్ట్రపతి చెప్పా రు. ఉపాధ్యాయుడి ప్రతిభను, పాండిత్యాన్ని సమా జం గౌరవిస్తుందని, ఇది మన సాంప్రదాయం అని, అయితే ప్రస్తుత విద్యావ్యవస్థలో ఇది జరుగు తోందా? అనే ప్రశ్న వస్తోందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఒక్కసారి ఆత్మపరి శీలన చేసుకోవల్సి ఉందని తెలిపారు. పర్యావరణం దెబ్బతినడం ఆందోళనకరం అని, మనిషికి, ప్రకృతికి మధ్య ఉండే సజావైన సహజీవన ప్రక్రియ పరిరక్షణ అత్యవసరం అని కోరారు.