Friday, March 29, 2024

కరోనా యోధులు నిజమైన హీరోలు

- Advertisement -
- Advertisement -

 దేశం సర్వదా రుణపడి ఉంటుంది
 గల్వాన్ అమర సైనికులకు జాతిపక్షాన నివాళి

 2020 సంవత్సరం సవాళ్లు తేవడంతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పింది
 పంద్రాగస్టు సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగం

President Ram Nath Kovind address Nation on I-Day Eve

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తలపడుతున్న క్షేత్రస్థాయి యోధులకు దేశం రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తెలిపారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ఇతరత్రా కార్యకర్తలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభ దశలో జాతికి ఎనలేని సేవలు అందిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా శుక్రవారం దేశ రాష్ట్రపతి దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఫ్రంట్‌లైన్ కరోనా వారియర్స్ దేశమంతా సలాం కొడుతుందని రాష్ట్రపతి తెలిపారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఈసారి స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నియంత్రింగా సాగుతాయి. ఇప్పుడు నెలకొని ఉన్న కరోనా పరిస్థితుల మధ్య తీసుకునే అనేక జాగ్రత్త చర్యల నడుమ ఈ ఉత్సవాల రూపం మారిందని రాష్ట్రపతి తెలిపారు. భయానక వైరస్‌ను ప్రపంచంతో పాటు మనదేశమూ ఎదుర్కొంటోందని, దీని ప్రభావంతో సాధారణ, ప్రత్యేక కార్యక్రమాలకు, చివరికి దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, ఇది ప్రక్రియకు విచ్ఛిన్నకారిగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. పనులు స్తంభించాయని, అత్యధిక సంఖ్యలో ప్రాణాలు పొయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో కరోనాతో పోరుకు ప్రభుత్వం సమర్థదంతంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా పనిచేస్తున్న వారి సేవలు అమూల్యమైనవని రాష్ట్రపతి తెలిపారు. వచ్చిపడ్డ వైరస్‌ను అరికట్టేందుకు వారు సాగిస్తున్న కృషి సాధారణం కాదని, ఇది సర్వశ్రేష్ట, మానవశక్తికి మించిన సూపర్‌హ్యుమన్ తోడ్పాటు అని అభివర్ణించారు.

ఇప్పుడు చేపడుతోన్న వైరస్ నివారణ చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ప్రపంచ స్థాయిలో చూస్తే మన దేశంలో వైరస్ వ్యాప్తి తగ్గిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ క్రమంలో గణనీయంగా మరణాలు తగ్గుముఖం పట్టాయని, ఈ విధంగా ప్రపంచానికి భారత్ ఆదర్శమైందని, వైద్య చికిత్స ప్రక్రియలో ఓ సరైన ఉదాహరణగా మారిందని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు తమ ఆరోగ్య పరిస్థితిని లెక్కచేయకుండా, కరోనా సోకిన వారికి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ రావడంతోనే రికవరీ రేటు పెరిగిందని రాష్ట్రపతి తెలిపారు. వారికి ఈ దేశం ఎంతైనా రుణపడి ఉంటుందని అన్నారు. వారి డ్యూటీలు, పనివేళలు ఇతరత్రా అంశాలకు అతీతంగా వైరస్ బారినపడ్డ వారికి విద్యుక్త ధర్మం లో భాగంగా చికిత్స అందిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. ఇక నిత్యావసర సరుకుల పంపిణీల బాధ్యతలో ఉన్న సిబ్బంది కూడా ఈ కష్టకాలంలో ముందుకు సా గుతూ ప్రజలందరికీ సరైన రీతిలో సరఫరాలు అందేలా చేస్తున్నారని చెప్పారు. వీరితో పాటు పలువురు క్షేత్రస్థాయి యోధులు ఈ కరోనాతో పోరు సల్పుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
రామ మందిర నిర్మాణ ప్రస్తావన
రాష్ట్రపతి రామ్‌నాథ్ తమ ప్రసంగంలో అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల ప్రారంభం గురించి ప్రస్తావించారు. పది రోజుల క్రితమే అయోధ్యలో ఆలయ శంకుస్థాపన జరిగిందని, ఈ ఘట్టం భారతీయులకు గర్వకారణం అని రాష్ట్రపతి తెలిపారు. చిరకాలపు వాంఛకు అనుగుణంగా అక్కడ అద్భుత ఆలయం నెలకొంటోందని అన్నారు. ఇది కలకాలం గుర్తుండే ఘట్టం అవుతుందని తెలిపారు. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దుల వెంబడి గల్వాన్ లోయలో చైనా సేనలతో ఘర్షణ క్రమంలో అమరులైన 20 మంది భారతీయ జవాన్లను జాతి ఎల్లవేళలా గుర్తుంచుకుంటుందని, వారికి తమ నివాళులు అర్పిస్తున్నానని ఈ సందేశం వేళలో రాష్ట్రపతి ప్రకటించారు. దేశం స్వయం సమృద్ధి దిశలో సాగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని కూడా రాష్ట్రపతి ప్రస్తావించారు.

పాఠాలు నేర్పిన 2020
ఈ సంవత్సరం ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పిందని, సవాళ్ల మధ్య ముందుకు ధైర్యంగా సాగడం గురించి మనం ఈ సంవత్సరం నుంచి ప్రత్యక్షంగా ఎంతో తెలుసుకున్నామని రాష్టపతి చెప్పారు. కరోనా వేళ ఇంటి నుంచే పని, ఇ లెర్నింగ్ పద్థతులు పెరిగాయని అన్నారు. ప్రతి మనిషి ప్రకృతితో అనుసంధానం అయి జీవించడం నేర్చుకున్నాడని, దీనితో తనలోని శక్తి ఏమిటనేది తెలిసివస్తోందన్నారు.
రాష్ట్రాలు బాగా స్పందించాయి
కరోనా కట్టడిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గణనీయ చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి తమ పంద్రాగస్టు సందేశంలో తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టారని కితాబు ఇచ్చారు. విస్తృతస్థాయి, బహుళ వైవిధ్య భరిత, అత్యధిక జన సాంద్రత ఉన్న దేశంలో ఈ కరో నా సవాలును ఎదుర్కొవడం మానవాతీత శక్తి స్థాయి ప్రయత్నాలతోనే సాధ్యం అవుతుందని, కోవిడ్ వారియర్స్ ఈ దిశలో ముందడుగు వేశారని రాష్ట్రపతి కొనియాడారు. ప్రభుత్వాలు తీసుకుంటూ వచ్చిన అన్ని చర్యలకు ప్రజానీకం నుంచి పూర్తిస్థాయిలో మనస్ఫూర్తితో మద్దతు దక్కిందని రాష్ట్రపతి తెలిపారు.

President Ram Nath Kovind address Nation on I-Day Eve

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News