Friday, April 19, 2024

15 ఏళ్ల తర్వాత రైల్లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

President Ramnath Kovind travelled by Train

స్వస్థలం కాన్పూర్‌కు ప్రత్యేక రైల్లో వెళ్లిన రాంనాథ్ కోవింద్

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితా దేవితతో లిసి తన స్వస్థలం కాన్పూర్‌కు రైలులో బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్ట్రపతికి రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్, సిఇఓ సునీల్ శర్మ వీడ్కోలు పలికారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం వెళుతున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణం చేయడం ఇదే తొలిసారి.

2006లో అప్పటి రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ఢిల్లీనుంచి డెహ్రాడూన్‌కు రైల్లో ప్రయాణించారు. కాన్పూర్ డేహట్ మార్గంలో ఈ ప్రత్యేక రైలు జింఝాక్, రురా వద్ద కొద్ది సేపు ఆగనుంది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన పాత పరిచయస్థులను, పాఠశాల మిత్రులను కలిసి మాట్లాడనున్నారు. ఆ తర్వాత స్వగ్రామానికి చేరుకుంటారు. స్వగ్రామాన్ని సందర్శించిన తర్వాత ఈ నెల 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి లక్నో చేరుకుంటారు. లక్నో పర్యటన అనంతరం 29న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో లక్నోనుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ తరచూ రైల్లో ప్రయాణించే వారని రికార్డులు చెబుతున్నాయని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన బీహార్‌లోని సివాన్ జిల్లాలోని తన జన్మస్థమైన జిరాడీ గ్రామానికి వెళ్లారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News