Home జాతీయ వార్తలు రాష్ట్రపతి పాలన

రాష్ట్రపతి పాలన

President's

 

కోమాలో మహారాష్ట్ర అసెంబ్లీ

ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్‌సిపి మరి కొంత గడువు కోరడంతో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన గవర్నర్, ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం
గవర్నర్ తనకు వ్యవధి నిరాకరించడంపై సుప్రీం కోర్టులో శివసేన పిటిషన్

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో కుర్చీలాటకు తెరపడింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి మంగళవారం సాయంత్రం సంతకం చేశారు. అయితే అసెంబీన్లి మాత్రం సుప్త చేతనావస్థలో ఉంచిన ట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపా యి. అంతకుముందు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర భుత్వం ఏర్పాటుకు ఎన్‌సిపి మరింతగడువు కోరడంతో రాష్ట్రంలో ఇక రా జ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు కు అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చి న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. రాష్ట్రపతి
పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి నివేదిక పంపించారు.

దీని ఆధారంగా మంగళవారం మధ్యాహ్న ం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర మంత్రివర్గం సి ఫారసు, మహారాష్ట్ర గవర్నర్ నివేదిక ను కేంద్ర హోం శాఖ అధికారులు రా ష్ట్రపతికి పంపించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను, అవకాశాలను పరిశీలించామని, ప్రభుత్వం ఏర్పాటుకు ఎక్కడా అవకాశాలు కనిపించలేదని గవర్నర్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి కనుక గవర్నర్ కార్యాలయం ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం కేందర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై దీనిపై తీర్మానం చేసింది.

అనంతరం కేంద్ర కేబినెట్ తీర్మానం, గవర్నర్ నివేదిక రాష్ట్రపతి భవన్ చేరాయి. పంజాబ్ పర్యటన ముగించుకొని సాయంత్రం ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ దీనికి ఆమోదముద్ర వేశారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ సుప్త చేతనావస్థలోకి చేరింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎన్‌సిపికి గవర్నర్ మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు సమయం సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గడువు ముగియక ముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌తో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ముగ్గురు సీనియర్ నేతలను ముంబయికి పంపించిన తరుణంలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ గవర్నర్ సిఫార్సు చేయడం చర్చనీయాంశం అయింది.

రౌత్‌ను కలిసిన ఉద్ధవ్, పవార్ ఈ రాజకీయ డ్రామా కొనసాగుతుండగానే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్‌లు విడివిడిగా ముంబయి లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను కలిశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బిజెపితో అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌ను మొదటినుంచీ బలంగా వినిపిస్తున్న నేత రౌత్ కావడం గమనార్హం. మహారాష్ట్రలో ప్రభుతవం ఏర్పాటుపై తమ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని సంజయ్ రౌత్ మంగవారం ఉదయం ఓ ట్వీట్‌లో సంకేతాలు ఇచ్చారు. ‘అలలకు భయపడితే పడవ తీరం చేరలేదు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు ఏదీ కోల్పోయేది ఉండదు. నిజానికి.. మేం విజయం సాధిస్తాం’ అని రౌత్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా కేంద్రమంత్రివర్గంనుంచి శివసేన ఎంపి అరవింద్ సావంత్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని, ఈ రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ప్రతినిధి మంగవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు సావంత్ రాజీనామాను ఆమోదించడం జరిగిందని ఆ ప్రతినిధి తెలిపారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో తాను కేంద్ర మంతిగా కొనసాగడం భావ్యం కాదంటూ సోమవారం సావంత్ కేంద్రమంత్రివర్గంనుంచి రాజీనామా చేయడం తెలిసిందే. సావంత్ నిర్వహిస్తున్న భారీ పరిశ్రమల శాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు అప్పగించారు.

గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేఖలు సమర్పించడానికి గవర్నర్ భగత్ సింగ్ కో ష్యారీ తమకు మరింత గడువు ఇవ్వకపోవడంపై శివసేన పార్టీ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశామని శివసేన నేత అనిల్ పరబ్ ఒక న్యూస్ చానల్‌కు చెప్పారు. సుప్రీంకోర్టులో తమ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తారని ఆయన చెప్పా రు. మంగళవారమే తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని తాము కోరామని, అయితే ఇప్పటికిప్పుడు ధర్మాసనా న్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలియజేసిందని శివసేన తరఫు పిటిషన్ దాఖలలు చేసిన లాయరు సు నీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. బుధవారం ఉదయం పదిన్నర గం టలకు తిరిగి కోర్టు ముందు తాజాగా పిటిషన్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలియజేసినట్లు

అవకాశం కోల్పోయింది బిజెపియే
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే
ముంబయి:ప్రభుత్వం ఏర్పాటులో అవకాశం కోల్పోయింది బిజెపియేనని, తాము కాదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తమకు సిఎం పదవి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో బిజెపి విఫలమైందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఉద్ధవ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రభఉత్వం ఏర్పాటుకు ఒక ఫార్ములాను శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు కలిసి రూపొందిస్తాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్, ఎన్‌సిపిలాగే శివసేనకు కూడా కనీస ఉమ్మడి కార్యక్రమంపై స్పష్టత కావాలని అయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉద్ధవ్ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై విమర్శలు గుప్పించారు. ‘ కనీస ఉమ్మడి కార్యక్రమంపై కాంగ్రెస్, ఎన్‌సిపిల లాగానే శివసేనకు కూడా స్పష్టత అవసరం.

మేము సోమవారమే తొలిసారి కాంగ్రెస్, ఎన్‌సిపిల మద్దతు కోరాం. ఎన్నికల ఫలితాలకు ముందునుంచీ ఈ రెండు పార్టీలతో మేము టచ్‌లో ఉన్నామన్న బిజెపి ఆరోపణ అబద్ధమని ఇది చెబుతోంది’ అని ఆయన అన్నారు.బిజెపికిచ్చిన గడువు ముగియడానికి ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేనను ఆహ్వానించారని ఉద్ధవ్ ఆరోపించారు. అంతేకాదు, బిజెపికి మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ తమకు మాత్రం 24 గంటలే ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. చాలా కాలం బిజెపి. శివసేన కలిసి ఉన్నాయని, కానీ తాము ఇప్పుడు ఎన్‌సిపితో కలిసి పని చేయాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.

మా ప్రయత్నాలు కొనసాగుతాయిమహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్‌సిపి
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతాయని ఎన్‌సిని, కాంగ్రెస్ స్పష్టం చేశాయి. మహారాష్ట్రలో మంగళవారం రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఢిల్లీలో ఈ రెండు పార్టీల నేతలు సమావేశమైనారు. అనంతరం ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు మీడియాతో మాట్లాడారు. శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. శివసేనకు మద్దతు ఇవ్వడానికి ముందు ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలో తమ రెండు పార్టీలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి తాము ఇంకా చర్చించలేదని శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్ర పరిణామాలపై తాము ఎలాంటి ఆందోళనా చెందడం లేదన్నారు.

President’s rule in Maharashtra