Home రంగారెడ్డి ప్రభుత్వాన్ని గాడిన పెట్టేది పత్రికలే

ప్రభుత్వాన్ని గాడిన పెట్టేది పత్రికలే

– తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ప్రసార సాధనాలే
– రాష్ట్ర జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం

KODANDARAM

మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం టౌన్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ప్రసార సాదనాలేనని తెలంగాణ రాష్ట్ర జెఏసి చైర్మన్ ప్రొ. కోదండరాం పేర్కోన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వి కె కవెన్షన్ హాల్‌లో 10 టివి క్యాలెండర్‌ను ఆయనతో పాటు పట్నం ఏంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడె విధంగా పత్రికలు దోహాద పడాలని సూచించారు. నిజం నిర్భయంగా ప్రజలకు తెలియజేయాలని పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యలు వెలుగు లోనికి తీసుకవచ్చినప్పుడె గుర్తిస్తారని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం నేర్చుకున్నారని అన్నారు. 2017 సంవత్సరంలో ఐఖ్యతను సాదించాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం భూసెకరణను వీలైనంత తక్కువగా సేకరించాలని తెలిపారు. దీంతో ఉపాది కనుమైరుగైయ్యె అవకాశాలు సన్నగిల్లుతాయని ఆశాబావం వ్యక్తం చేశారు.
ప్రజల వానిని ప్రపంచానికి తెలియజేయాలి …
పట్నం ఎంపిపి …
ప్రజల వానిని ప్రపంచానికి తెలియ జేయాల్సిన అవసరం ఏంతైనా ఉందని పట్నం ఏంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి పత్రికా రిపోర్టకు సూచించారు. ప్రజా సమస్యలు తెలికి తీసినప్పుడె ప్రజలు ఆదరిస్తారని గుర్తు చేశారు. ప్రజల యొక్క వానికి నిర్బయంగా పత్రికల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 10 టివి ఈ మద్యనే అన్ని చానల్స్‌తో పోటిగా నిలబడిందని గుర్తు చేశారు. ఈకార్యాక్రమంలో జెఏసి జిల్లా చైర్మన్ వెదిరె చల్మారెడ్డి, రాష్ట్ర జెఏసి కో కన్వినర్ రమెష్ , పట్నం నియోజకవర్గ జెఏసి కన్వీనర్ మడుపు వేనుగోపాల్ ,దక్షణ మద్య రైల్వే బోర్డు సబ్యులు , పట్నం లయన్ క్లబ్ అద్యక్షులు కె వి రమెష్ రాజు , వ్య వ కార్మీక సంఘం జిల్లా కార్యాదర్శి జగన్ , టిఎన్‌ఎస్‌ఎప్ జిల్లా ప్రధాన కార్యాదర్శి నిట్టు జగదీష్ ,నాయకులు అంజయ్య, రైతు సంఘం నాయకులు వెంకటేశ్, ఇబ్రహీంపట్నం నగర పంచాయితి జెఏసి చైర్మన్ పసునూరి వినోద్ కుమార్ గుప్తా , శ్రీనువాస్ , వెంకటేశ్ , అంజయ్య తదితరులు పాల్గొన్నారు.