Wednesday, March 22, 2023

జోరుగా జాతీయ రహదారి విస్తరణ!

- Advertisement -

land

*భూ సేకరణకు జారీ అయిన నోటీసులు

*మ్యాప్ లు విడుదల చేసిన నేషనల్ హైవే ఆథారిటీ

*తొలి విడతలో సంగారెడ్డి నుంచి 150కి.మీల దూరం

*వేగంగా జారీ అవుతున్న
నోటీసులు

ఎట్టకేలకు సంగారెడ్డి-నాందేడ్ రహదారికి మహార్దశ పట్టనుంది. గత యూపిఏ ప్రభుత్వంలోనే అప్పటివరకు రాష్ట్ర రహాదారిగా ఉన్న సంగారెడ్డి-నాందేడ్-అకో లా రహాదారికి జాతీయ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ప్రభుత్వం మారడంతో ఈ అంశంపై పెద్దగా ఎవరూ కూడా దృష్టి సా రించలేకపోవడంతో విస్తరణ ప నులు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రస్తుతం ఎంపి బిబి పాటిల్ చోరవతో మళ్లీ పనులు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడతగా సం గారెడ్డి నుంచి రాష్ట్ర సరిహాద్దు మద్నూర్ వరకు దాదాపు 150 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు. ప్రధాన పట్టణాలలో బైపాస్ ర హాదారులను నిర్మించనున్నారు. ఈ మేరకు రెవె న్యూ శాఖ ఆధ్వర్యంలో భూసేకరణకై సర్వే కూ డా చేపట్టారు. గత మూడు రోజుల నుంచి మెద క్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లాదుర్గం, పె ద్దశంకరంపేట మండలాలో భూములను కోల్పోతున్న రైతులతో అభిప్రాయసేకరణ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం. మన తెలంగాణ/పెద్దశంకరంపేట: సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర కు వెళ్లాలంటే ప్రధానంగా జహిరాబాద్ తో పాటు పెద్దశంకరంపేట రహదారి గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. గతంలో ఈ రహదారి రాష్ట్ర రహాదారి నెం.13 గా కొనసాగింది. ఈ దారి వెంట హైదరాబాద్ నుంచి న్యూదిల్లీ వెళ్లె భారీ రవాణా వాహానాలు ప్రధానంగా వెళ్తుంటాయి. చెన్నై, బెంగుళూర్ నుంచి వచ్చే వాహానాలు సైతం దిల్లీ, హర్యానా, రాజస్థాన్ వెళ్లాలంటే ఈ రహాదారినే ఎంచుకుంటారు. ఇది జోగిపేట, పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల మీదుగా వెళ్తూ నిజామాబాద్ జిల్లా పిట్లం, బిచ్‌కుంద,మధ్నూర్,మండలాల మీదుగా మహారాష్ట్ర లోని డెగ్లూర్ ద్వారా నాందేడ్, అకోలా లకు వెళుతుంది.  గతంలో పూర్తి గా గుంతలమయమైన ఈ రహాదారికి జాతీయ హోదా ను గత యూపిఏ ప్రభుత్వ హాయాంలో వచ్చింది. అప్పటి జహిరాబాద్ పార్లమెంట్ సభ్యు లు సురేష్ కుమార్ షెట్కార్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మాల  ప్రోద్భలంతో ఈ రహాదారికి జాతీయ హోదా దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఈ రహాదారికి నెంబరు 161 కేటాయించింది. నెంబరు కూ డా రావడంతో ముందుగా పాక్షికంగా గుంతలు పూడ్చడం కోసం రూ. 96 లక్షలు,  పూర్తిగా పాడైపోయిన చోట నూతన రహాదారుల కోసం రూ.11 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు వెంటనే నిధులుకూడా విడుదలై పనులు కూడా గత సంవత్సరం పూర్తి చేశారు. 2016 వర్షాకాలంలో సంగారెడ్డి నుంచి జిల్లా సరిహాద్దు పిట్లం వరకు వెళ్ళాలంటేనే ప్రయాణీకులకు నరకం కనిపించేది.  గత సంవత్సరం గుంతలు పూడ్చడంతో పాటు, చెడిపోయిన చోటల్లా  బిట్లు బిట్లుగా విడదీసి నూతన రహాదారిని పటిష్టవంతంగా నిర్మించారు. సంబంధిత కాంట్రాక్టర్ దే అయిదు సంవత్సరాల వరకు నిర్వహణ బాధ్యత ఉండడంతో చెడిపోయిన వెంట నే మరమ్మత్తులు కూడా చేస్తుండడంతో ఈ రహాదారి ఇప్పుడు సుందరంగా తయారైంది. అయితే మళ్లీ మిషన్ భగీరథ పనులతో అక్కడక్కడ గోతులు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2016 బడ్జెట్లో నాలుగు లేన్ల రహాదారికోసం నిధులుకూడా విడుదల చేసింది. తొలివిడతగా సంగారెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహాద్దు మద్నూర్   వరకు 150 కి లో మీటర్ల మేర సర్వేపనులకు గాను రూ. 150 కోట్లు కూడా మంజూరు చేసి పనులు సర్వే పూర్తి చేశారు. అయితే తాజగా వీలైనంత త్వరగా రో డ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ ఆథార్టి అధికారులు బావిస్తున్నారు. రోడ్డు పనుల కోసం అధికారుల్లో కదలిక రావడంతో ప్ర యాణీకుల్లొ హర్షం వ్యక్తవుతోంది.

ప్రధానంగా పట్టణాలలో నుంచి కా కుండా బైపాస్ రహాదారి నిర్మాణానికే అధికారులు మొగ్గు చూపి, దానినే ఖరారు చేశారు. ఆ మేరకు సర్వేకూడా చేపట్టి రైతులకు నోటీసులు జారీ చేశారు. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అల్లాదర్గుం, పెద్దశంకరంపేట మండలాల్లోని రైతులకు సంబంధించిన భూముల వివరాలను ఖరారు చేశారు. పట్టణాల జొలికి వెళ్ళకుండా అన్ని పట్టణాలలో బైపాస్ రహాదారులను నిర్మించాలని సంబంధిత అధార్టీ వారు నిర్ణయించడంతో ఆ మే రకు సర్వే పనులు  పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ దారిలో ప్రధాన ప ట్టణాలైన జోగిపేట, పెద్దశంకరంపేట, పిట్లం, మధ్నూర్ లలో పూర్తి స్థాయిలో బైపాస్ రహాదారులను అభివృద్ది చేయనున్నారు. సంబంధిత తహాసీల్దార్‌ల నుంచి భూమి సంబంధతి వివరాలు తీసుకున్న అధికారు లు సర్వే నెంబర్లతో మ్యాపు కూడా సిద్దం చేసుకున్నారు. భూ సేకరణపనులు వెంటనే ప్రారంభించారు.ప్రస్తుతం ఆయా భూముల యజమానులతో అభిప్రాయసేకరణ కొనసాగుతోంది. గతమూడు రోజులుగా టేజులుగా, అల్లాదుర్గం,పెద్దశంకరంపేట మండలాల పరిదిలొని రైతులతో సమావేశమై వారి ఆభ్యంతరాలను స్వీకరించారు. మరో సంవత్సరంలో రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలనే అలొచనతో ఉన్నారు. ఏది ఏమైనా ప్రధాన రహాదారిని విస్తరణతో ప్రమాదాలకు కల్లెం పడడమే కాకుండా హైదరాబాద్ వెళ్లెందుకు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. రహదారి పనులు తొందరగా ప్రారంభం అయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాల్సిన ఆవసరం ఏంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. అలాగే రోడ్డు విస్తరణ వల్ల నష్టపోతున్న రైతులకు అక్కడక్కడ  చిరువ్యాపారులకు, ఇతర వర్గాల వారికి కూడా తగిన నష్టపరిహారం చెల్లించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాల్సిన బాద్యత ప్రజాప్రతినిధులపైన ఎంతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News