Home తాజా వార్తలు అడ్డగోలు నిర్మాణాలకు అడ్డుకట్ట పడేనా?

అడ్డగోలు నిర్మాణాలకు అడ్డుకట్ట పడేనా?

new municipal law

 

కొత్త మున్సిపల్ చట్టంతో అక్రమార్కుల్లో దడ
ఇప్పటి వరకు ఎక్కడ కనిపించని నిబంధనలు
రోడ్లన్నీ అన్యాక్రాంతం
కనిపించని పార్కింగ్ స్థలాలు
అక్రమార్కలకు అడ్డగా మారిన కార్పొరేషన్

నిజామాబాద్‌ : అధికారుల్లో పెరిగిపోయిన అవినీతి, ప్రజల పక్షాన గెలిచిన కార్పొరేటర్లు,ఇతర పాలకుల చేతివాటం కారణంగా ని జామాబాద్ నగరప్రజలు కష్టాలపాలవుతున్నారు. నగర నిర్మాణంలో అతి కీలకమైన రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు తిలోదకలు ఇస్తూ అక్రమాలకు ప్రజల కష్టాలకు కారణమవుతున్నారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు కొనసాగకపోవడంతో ఒక వైపు కార్పోరేషన్ ఆదాయానికి గండి పడుతుండగా, మరోవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు సైతం కనీస నిబంధనలు పాటించకపోగా అనుమతుల కో సం పెద్ద ఎత్తున మాముళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. దశాబ్దాల కా లం లోకబుహిష్టమైన మున్సిపల్ నిబంధనలకు సిఎం కెసిఆర్ తిలోదలకు ఇ చ్చిన సంగతి తెలిసిందే.వాటి స్థానంలో ప్రజలకు మరింత మేలు చేసే కొత్త ము న్సిపల్ చట్టానికి ఆడినెన్స్ తేవడంతో నగర ప్రజల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డ భ వన నిర్మాణదారుల్లో మాత్రం దడ మొదలైంది. నిజానికి గ్రామం నుండి పట్ట ణం వరకు జరిగే నిర్మాణాల్లో వివిధ కేటగిరిల కింద విభజించి నిబంధనలు అ మలు చేయాల్సి ఉంటుంది.

నిర్మాణాలు చేపట్టే వారి మేలుతో పాటు గ్రా మం, పట్టణ ప్రజల సౌకర్యాలను,హక్కులు, గ్రామ,నగర అవసరాలు అన్నింటిని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుం ది.ప్రభుత్వాలు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని పెరిగే జనాభాను అంచన వేసి నిబంధనలను రూపొందిస్తుంటాయి. వాటి అమలు ప్రకారం భవన నిర్మాణం ప్రదేశం,నిర్మాణ తీరు, భవన వినియోగం, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణానికి అనుమతులను జారీ చేయాల్సి ఉంటుంది. నిర్మాణాన్ని బట్టి పాలక మండలికి తగిన ఆదాయం సైతం సమకూరేలా నిబంధనలు ఉండగా అధికారుల తీరుతో నగర కార్పోరేషన్‌కు రావాల్సిన పన్నులు రాకుండా పోతుండగా ప్రజలకు తీరని సమస్యలు ఎదురవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ నగరంలో భారీ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. పెరుగుతున్న వ్యాపారంతో పెద్ద ఎత్తున చేపడుతున్న నిర్మాణాల్లో అంతస్థుల సంఖ్య పెరుగుతుండగా వాటిలో నెలకొల్పే వ్యాపారాలకు సరిపడ పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తేవడం లేదు. జనాభా సైతం పెరుగుతుండగా సందడిగా మారుతున్న నగరంలో ట్రాఫిక్ సమస్య భూ తంలా మారింది. నగరంలో ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారగా రోడ్డుపై పార్కింగ్ చేస్తున్న వాహనాలతో రాకపోకలకు సమస్య ఏర్పడుతుంది. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి అనుమతులు లేని పార్కింగ్ వాహనాలకు జరిమానాలు విధిస్తుండడంతో వాహనదారులు,వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

నిజానికి భవనాల నిర్మాణ సమయంలో అధికారులు నిబంధనల మే రకు నడుచుకుంటే ఆయా భవనాల్లోని వ్యాపార సముదాయాల్లో కొనుగోళ్ల కోసం వచ్చే వారి వాహనాలు పార్కింగ్ స్థలంలో నిలిపే అవకాశం ఉంటుంది. భవనాల్లో పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వెలుస్తుండగా గ్రౌ ండ్ లెవల్ మొదలుకొనిపై అంతస్తు వరకు అన్ని గదులు అద్దెకు ఇ స్తు న్న పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాణ సమయంలో పార్కింగ్ అంశాన్ని పక్కనబెట్టి అండర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే సెల్లార్‌ను పార్కింగ్‌గా చూపుతు న్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి అండర్ గ్రౌండ్‌లో నిర్మించే సెల్లార్లలో ఎక్కడ పార్కింగ్ అమలు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు.

భారీ భవనాలకు గ్రౌండ్ లెవల్‌లోనే పార్కింగ్‌కు స్థలాన్ని సమకూరిస్తే వాహనాలు రోడ్డుపై నిలిపే పరిస్థితి ఉండేది కాదు. హైదరాబాద్ రోడ్డు మొదలుకొని ఆర్మూర్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, ఖలీల్‌వాడి ప్రాంతాల్లో భారీ భవనాలు పా ర్కింగ్ లేకుండానే నిర్మిస్తుండడం గమనార్హం. ఇక్కడే అధికారులు తమ అధికారాలను భారీ మొత్తంలో మాముళ్లకు తాకట్టుపెడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పాలక మండలి సభ్యులు, అధికారులు కలిసి భవన నిర్మాణ యాజమానుల నుండి పెద్ద మొత్తంలో నగదును రాబడుతున్న ట్లు ఆరోపణలున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గృహ అవసరాల కోసం నిర్మిస్తున్న సామాన్య జనం నుండి సైతం పలువురు కార్పోరేటర్లు పెద్ద ఎత్తున మాముళ్లను రాబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డి మాండ్ చేసినంత ముట్టజెబితేగానీ నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నగరంలో కనిపిస్తోంది.

వ్యాపార సముదాయాల్లో ప్రజల అవసరాలు, నగర భవిష్యత్తు అన్న అంశాన్ని తాకట్టు పెట్టి పార్కింగ్ స్థలం లేకుండా భవనాలకు అనుమతులు ఇస్తుండడంతో ఖలీల్‌వాడిలో రాకపోకలు తీ వ్ర సమస్యగా మారాయి. ఆ ప్రాంతమంతా ఆసుపత్రులతో నిండిపోగా ఆసుపత్రులకు వచ్చే రోగులు,ఇతరులతో వాహనాలు నిండిపోతున్నా యి. అనేక నిర్మాణాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న బేరాసారాలతో నిబంధనలు భవనాల కింద పాతరవేయబడుతున్నాయి.

గతంలో ఓ వైద్యుని భవన నిర్మాణ విషయంలో పెద్ద ఎత్తున మాముళ్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడం, సదరు వైద్యులు అధికారులను ఎదురించి కోర్టుకు వెళ్లడం పట్ల అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అయిన కార్పోరేషన్ పాలకుల్లో మార్పు రాకపోగా కార్పోరేషన్ అధికారులు త మ బాధ్యతలను తాకట్టు పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ మే రకు ఒక్కొ భవనం నిర్మాణ సమయంలో రూ.లు 2లక్షల నుండి 6లక్షల వరకు రాబడుతున్నట్లు సమాచారం.అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాల విషయంలోను ఇదే పరిస్థితి కనిపిస్తుండగా కఠినంగా అమలు చేయాల్సిన ని బంధనలు గాలికిపోతున్నాయి.నిజానికి భవన నిర్మాణ స్థలాన్ని బట్టి 20 శాతంతో పాటు మరో 7శాతం కలిపి 27శాతం ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం వినియోగించాల్సి ఉంటుంది.

ఆ మొత్తంలో 2శాతం విజిటర్స్ కోసం కాగా ఖచ్చితంగా స్థలాన్ని వదులాల్సి ఉంటుంది.అగ్నిప్రమాదాలు జరిగితే భవనంలోని మొత్తం జనం సురక్షితంగా బయటకు వెళ్లేలా మెట్ల నిర్మాణాలతో పాటు అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. భవనం నిర్మాణం విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించి సమీప భవనాలకు నష్టం వాటిల్లకుండా చూడడంతో పాటు దుమ్ము, దూళీ తదితర అనర్థాలు సమీప ప్రాంత ప్రజలకు వాటిల్లకుండా చూడాల్సి ఉం టుంది. ఆయా అంశాలు పక్కన బెడితే భవన నిర్మాణం మొదలయితే చాలు తమ డిమాండ్ నెరవేర్చాలంటూ అధికారుల నుండి, ప్రజాప్రతినిధుల నుండి వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు పలుమార్లు నగరంలోని పలువురు ప్రజాప్రతినిధులతో పా టు అధికారులపై ఎంఎల్‌ఎ బిగాల గణేష్‌గుప్తా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.అయినా అధికారుల్లో మార్పు రాకపోగా ఎలాంటి పా ర్కింగ్ లేకుండా దర్జాగా భవనాలు పూర్తవుతున్నాయి. ఈ నిర్మాణాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వాహనాలతో ప్రయాణం చేయడం క ష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

Prevent irregularities with the new municipal law