Friday, March 29, 2024

పోలీసులపై ఉన్న వ్యతిరేక భావనను పోగొట్టాలి

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi calls for probationary IPS

ప్రతిపనిలో దేశమే ఫస్ట్ అన్న భావన ప్రతిబింబించాలి
ప్రొబేషనరీ ఐపిఎస్‌లకు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను పోగొట్టాల్సిన బాధ్యత ప్రొబేషనరీ ఐపిఎస్ అధికారులపై ఉందని ప్రధాని నరేద్ర మోడీ అన్నారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతి పనిలో ‘దేశమే ముందు, ఎప్పటికీ ముందు (నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్) అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఐపిఎస్ అధికారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించిన ప్రధాని వారికి పలు సూచనలు చేశారు. అధికారులుగా మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో జాతి ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని సూచించారు. ‘ఐపిసి అధికారుల వృత్తిలోని రాబోయే 25 సంవత్సరాలు.. భారత్ అభివృద్ధిలోని కీలకమైన 25 సంవత్సరాలుగా మారనున్నాయి.

ముఖ్యంగా విధుల్లో భాగంగా వివిధ దేశంలో ఎన్నో ప్రాంతాల్లో పని చేసే అవకాశం ఉన్నందున వేర్వేరు పాత్రలు పోషిస్తారు. దీంతో ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీసు వ్యవస్థను నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత మీ అందరిపై ఉంది’ ఉంది అని ప్రొబేషనరీ ఐపిఎస్ అధికారులకు ప్రధాని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశమే ముందు, ఎప్పటికీ ముందు అనే భావన ప్రతి పనిలోని ప్రతిబింబించాలని చెప్పారు. అంతేకాకుండా ఐక్య భారత్, శ్రేష్ఠ భారత్‌అనే నినాదాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని అన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొని ఉండడం అతిపెద్ద సవాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా వైరస్ విజృంభణ సమయంలో పోలీసు సిబ్బంది చేసిన సహాయం ఆ భావనను కాస్త తగ్గించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందన్నారు.

రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధుల్లో కుటుంబాలకు దూరంగా ఉండడమే కాకుండా, దేశ రక్షణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు అర్పించిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న వ్యతిరేక దృక్పథాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రొబేషనరీ ఐపిఎస్‌లపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో సురాజ్య స్థాపనకోసం ప్రొబేషనరీ ఐపిఎస్‌లు పని చేయాలని ప్రధాని మోడీ హితవు పలికారు. గత 75 ఏళ్లలో భారత్ మెరుగైన పోలీసు సర్వీస్‌ను నిర్మించడానికి ప్రయత్నించిందని, ఇటీవలి సంవత్సరాల్లో పోలీసు ట్రైనింగ్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ప్రధాని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News