Home జాతీయ వార్తలు ఆయన మాట్లాడుతున్నారు.. నాకు సంతోషంగా ఉంది!

ఆయన మాట్లాడుతున్నారు.. నాకు సంతోషంగా ఉంది!

Modi-Rahulలక్నో : ఓ యువనేత మాట్లాడటం నేర్చుకొని ప్రసంగాలు ఇస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ చలోక్తులు విసిరారు. లక్నోలో జరిగిన క్యాన్సర్ కేంద్ర శంకుస్థాపనకు హాజరైన మోడీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్ధేశించి ఈ విధంగా ప్రసంగించారు. పార్లమెంట్‌లో తనను మాట్లాడనివ్వడం లేదని.. మాట్లాడితే భూకంపం వస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మోడీ లక్నో సభలో స్పందిస్తూ.. ‘ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాటం నేర్చుకుంటున్నారు. ఆయన ప్రసంగించకుంటే.. భూకంపం వచ్చేది, ఆయన మాట్లాడారు ఇక భూకంపం రాదు’ అని ఎద్దేవా చేశారు.