Home జాతీయ వార్తలు భారత్‌కు ఇది జీవన్మరణ సమస్య: ప్రధాని మోడీ

భారత్‌కు ఇది జీవన్మరణ సమస్య: ప్రధాని మోడీ

Modi-Mann-Ki-Baat

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌  నిర్ణయం ప్రజల ఆరోగ్యం కోసమేనని ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు. లాక్‌డౌన్‌ లక్ష్మణ రేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలన్నారు. కోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పారు. భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అతి ముఖ్యమని మోడీ అన్నారు. ఇంకా కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పిన ప్రధాని కరోనాపై వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం పోరాడుతున్నారని వెల్లడించారు. భారత్ కు ఇది జీవన్మరణ సమస్య వచ్చిందన్నారు. ప్రపంచ పరిస్థితులు చూశాకే.. లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాం. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగానే లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని కోరారు. తనపై కొందరు కోపంగా ఉన్నట్టు తనకు తెలుసన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని స్పష్టం చేశారు. అయితే దేశంలో 979కు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చేరాయి.

Prime Minister Narendra Modi in Mann Ki Baat