Home తాజా వార్తలు ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి మా మద్దతు: ట్రంప్

ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి మా మద్దతు: ట్రంప్

                     modi-meet-with-trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. మంగళవారం వైట్ హౌస్ వద్ద మోడీకి ట్రంప్ దంపతులు స్వాగతం పలికారు. ఇరుదేశాల నేతలు రక్షణ, వాణిజ్యం, ఉగ్రవాదంపై చర్చించారు. సమావేశం ముగిసిన తరువాత ట్రంప్, మోడీ ఉమ్మడి ప్రకటన చేశారు.

భారత్ అత్యంత ప్రాచీన దేశం, తమకు సన్నిహితమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్ ఎస్ జిలో (అణు సరఫరా దేశాల బృందం) భారత్ సభ్యత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా, భారత్ కలిసి పొరాడుతామని తెలిపారు. భారత్ తో ఆర్థిక మైత్రి కొనసాగుతుందని ట్రంప్ వెల్లడించారు.

భారత్-అమెరికా రెండు ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ…. అమెరికాతో భారత్ స్నేహం మరింత బలపడుతోందన్నారు. ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమని చెప్పారు. ఉగ్రవాదంపై అమెరికాతో కలిసి పోరాడుతామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఆదరణ మర్చిపోలేనిదని పొగిడారు.