Home అంతర్జాతీయ వార్తలు నేను చాలా లక్కీ

నేను చాలా లక్కీ

Prince Charles after recovering from coronavirus

 

లండన్ : కరోనా వైరస్ ‌నుంచి కోలుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ తెలిపారు. కోవిడ్ 19 పరీక్షలలో ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తనకు తక్కువ స్థాయిలో వైరస్ సోకడం లక్కీ అని 71 ఏండ్ల ప్రిన్స్ స్పందించారు. తాను క్రమేపీ కోలుకుంటున్నట్లే అని ఆనందం వ్యక్తం చేశారు. మార్చి చివరిలోనే ప్రిన్స్‌కు వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. దీనితో ఆయన క్వీన్ ఎలిజబెత్‌కు చెందిన స్కాట్‌లాండ్ ఎస్టేట్‌లోని బిర్కహల్ హోంలో స్వీయ క్వారంటైన్‌కు వెళ్లారు.

తనను వైరస్ తేలిగ్గానే వదిలిందని పేర్కొన్న ఛార్లెస్ ప్రస్తుత దశతో ఈ పర్యావరణాన్ని, భూగోళాన్ని కుదురుగా ఉండనివ్వాలనే తపనకు ఊతం ఏర్పడిందన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశలో ఆయన సరికొత్త రీతిలో గ్రేట్ రీసెట్ పేరిట అజెండాను ప్రకటించారు. తనకు ఎదురైన ఈ అస్వస్థతతో తన కర్తవ్యం తెలిసివచ్చిందని ప్రిన్స్ చెప్పారు. ఈ భూతలాన్ని తీర్చిదిద్దే క్రమానికి తనవంతు ఊతం అందించి , ఈ అజెండాను బలోపేతం చేసేందుకు సంకల్పించినట్లు తెలిపారు.

Prince Charles after recovering from coronavirus