Home జాతీయ వార్తలు సెలవులు అడిగిన పాపానికి గర్భవతిపై ప్రిన్సిపాల్ దాడి

సెలవులు అడిగిన పాపానికి గర్భవతిపై ప్రిన్సిపాల్ దాడి

Pregnancy Leaves

లూధియానా: పంజాబ్‌లోని లూదియానా ప్రాంతంలో గర్భవతిగా ఉన్న టీచర్ తనకు సెలవులు కావాలని అడిగితే ఆమెపై ప్రధానోపాధ్యాయురాలు దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అలమ్‌గిర్ ప్రాంతంతో ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఓ మహిళ పని చేస్తోంది. గర్భంతో ఉన్న టీచర్ తనకు సెలవులు కావాలని అడిగింది. వెంటనే ఆ టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి చేయడమేకాకుండా కొందరు మహిళల చేత దాడి చేయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారిణి మంజీత్ కౌర్ తెలిపాడు. సదరు టీచర్ ఏడుస్తూ ఉండగా కొందరు మహిళలు లాక్కుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 
Principal attack on Teacher for Pregnancy Leaves,Principal misbehaved with the pregnant teacher after she asked for pregnancy leaves.