Home జనగామ మంటల్లో ప్రైవేట్ బస్సు దగ్ధం..

మంటల్లో ప్రైవేట్ బస్సు దగ్ధం..

జనగామ: జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఛత్తీస్ గఢ్ లోని జగ్దల్ పూర్ నుంచి జనగామ మీదుగా హైదరాబాద్ వస్తుండగా ఓ ప్రైవేటు బస్సులో షాట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు ప్రక్కన ఆపి అందులో ప్రయాణిస్తున్న 26మంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దింపాడు.ఇంతలోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల లగేజీ కూడా మంటల్లో కాలి బూడిదైంది.

Private Bus Catches Fire at Jangaon District