Thursday, April 25, 2024

కరోనా టెస్టుల ధరలు పెంచిన ప్రైవేటు ఆసుపత్రులు

- Advertisement -
- Advertisement -

Private hospitals inflated prices of corona tests

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు వైద్య సేవలు చేసేందుకు అనుమతి ఇచ్చి వైద్యశాఖ ధరలు ప్రకటించింది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇదే అవకాశంగా దోపిడీ దందాకు తెగబడ్డారు. చికిత్స అందిస్తూ రోజుకు లక్ష రూపాయల బిల్లువేసి రోగులకు నరకయాతన చూపించారు. అధిక బిల్లుల వసూలపై పెద్ద ఎత్తున విమర్మలు రావడంతో ప్రభుత్వం ఇటీవలే రెండు ఆసుపత్రుల్లో సేవలు రద్దు చేసి, 43 ఆసుపత్రులకు నోటీసులు జారీచేసింది. అడ్డగోలుగా బిల్లువేస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లోని 50శాతం పడకలు స్వాధీనం చేసుకుంటామని మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో ఆసుపత్రుల నిర్వహకులు చికిత్సపై అచితూచిగా వ్యవహరిస్తూ కరోనా నిర్దారణ టెస్టులతో జేబులు నింపుకునే పనిలో పడ్డారు.

వైద్యశాఖ పరీక్షలు చేస్తే రూ. 2200 తీసుకోవాలని పేర్కొంది. కానీ ప్రైవేటు యాజమాన్యాలు రూ. 3400 తీసుకుంటూ బిల్లులు మాత్రం ప్రభుత్వం ధరల ప్రకారం తీసుకున్నట్లు రసీదు ఇస్తున్నట్లు రోగులు పేర్కొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వైద్యశాఖ సూచించిన ధరలు తీసుకుంటే తమకు గిట్టుబాటు ఉండదని పేర్కొంటూ దర్జాగా దోచుకుంటున్నారు. అదే విధంగా నగరంలో పేరుమోసిన కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఇంకో అడుగు ముందుకేసి దగ్గు,జలుబు, జ్వరం లక్షణాలతో వస్తే ఐదారు రకాలు టెస్టులు చేసి రూ. 25 వేలకుపై బిల్లు వేసి నయానా దందాకు ఒడిగడుతున్నారు. కరోనా నిర్దారణ కావాలంటే ర్యాపిడియాంటిజెన్‌టెస్టులు, ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తే పాజిటివ్,నెగిటివ్ అనే విషయంలో తెలుస్తుంది.

కానీ ప్రైవేటు ఆసుపత్రులు నూతన పోకడలకు పోతున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గ్రేటర్‌లో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్న, కేంద్రాలకు జనం తాకిడి పెరగడంతో దగ్గు,జలుబు,జ్వరం లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరి పరిస్దితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. రోగుల రాకతో నిర్వహకులు పలు రకాలు టెస్టులు చేయాలని చెబుతూ ముందుగానే పూర్తిగా బిల్లు చెల్లించాలని పేర్కొంటూ, ఐదు రోజుల తరువాత ఆసుపత్రికి వచ్చి రిపోర్టులు తీసుకెళ్లాలని చెబుతున్నారు. కొన్ని చోట్ల నెగిటివ్ వచ్చి పాజిటివ్‌గా వచ్చిందని చెబుతూ ఆసుపత్రిలో ఒత్తిడి చేసి చేర్చుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని మాయామాటలు చెబుతూ వెంటనేఅడ్మిట్ అయ్యేలా మోసాలకు పాల్పడుతున్నారు. అవసరం లేకున్నా టెస్టులు నిర్వహించే ఆసుపత్రులపై వైద్యశాఖ చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News