Home తాజా వార్తలు అక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు…

అక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు…

 public lands

 

మండల కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న భూకబ్జాలు
పట్టించుకోని సంబంధిత అధికారులు

నెక్కొండ : ప్రభుత్వ భూములనే లక్షంగా పెట్టుకొని కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూఆక్రమణలకు పాల్పడుతున్నారు. సాక్ష్యాత్తు స్థానిక నెక్కొండ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి సమీపాన ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణానికి అతిసమీపాన ఉన్న ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాన్ని ఆక్రమించాలనే ఉద్ధ్దేశ్యంతో గతకొద్దిరోజుల క్రితం ఎవరో గుర్తుతెలియని దుండగులు ఆ కేంద్రాన్ని భూస్థాపితం చేశారు. ఇట్టి విషంయంపై సంభందిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో కభ్జాదారులు యథ్థేశ్ఛగా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఆ కార్యాలయ ఆవరణంలోని సుమారు ఇరవై గుంటల భూమిలో పత్తివిత్తనాలను విత్తి పంటలను పండించాలనే లక్షంతో ఆ భూమిలో ధర్జాగా వ్యవసాయం చేస్తున్నారు.

ఈ తతంగం మొత్తం ప్రభుత్వ అధికారులు నిత్యం కార్యాలయాలకు వచ్చివెళ్లేటువంటి రహదారిలోనే నడుస్తుండటం గమనార్హం. ఇట్టి విషయంపై వివిధ ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు సంబంధిత అధికారులకు అగ్నిమాపకం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సైతం వినతిపత్రాలను అందిస్తూ వివిధ రీతుల్లో నిరసనలు వెలిబుచ్చుతున్న సంబంధిత అధికారులు మాత్రం ఎంతమాత్రం తమకు పట్టదనే రీతిలో వ్యవహరిస్తుండటంతో ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ, తమదైన శైలిలో ఎవరికి తోచినవిధంగ వారు మాట్లాడుకొంటున్నారు.

ప్రమాదవశాత్తు మండలంలోని ఏగ్రామంలోనైనా అగ్నిప్రమాదాలు గాని, లేక స్థానిక మండల కేంద్రంలోగల రైల్వే స్టేషన్ నుండి పలురైళ్ళు వివిధ ప్రాంతాలకు వచ్చివెళుతుంటాయి, ఒక్కరాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి పెట్రోల్, కిరోసిన్, బొగ్గు, బియ్యం, ఐరన్‌లలాంటి మరెన్నో పదార్థాలు నెక్కొండ స్టేషన్ నుండే వచ్చివెళ్ళుతున్న క్రమంలో వివిధ కారణాల చేత కొద్దిసమయం సేపు పలురైళ్ళు ప్టేషన్‌లో వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఆయా సందర్భంలోగాని, వేసవికాలంలో గాని వేడిమికారణం చేత అప్పుడప్పుడు బొగ్గు, పెట్రోల్‌లవంటి పదార్థాల్లోంచి మంటలు చెలరేగుతూ అగ్నిజ్వాలలకు ఆహుతి అవుతుంటాయి.

అలాంటి సందర్భ నేపథ్యంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలో అగ్నిమాపక కేంద్రం ఉండాలనే నెపంతో ఆనాటి ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు సుధీర్ఘ ఆలోచనల అనంతరం కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. అలాంటి సకల సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అగ్నిమాపకకేంద్రాన్ని కూల్చేసిన దుండగులను శిక్షించాల్సిన సంభంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చాలా భాధాకర విషయం. ఇకనైనా సంబంధిత అధికారులు గాఢనిద్రను వీడి, అగ్నిమాపక కేంద్రాన్ని కూల్చేసి భూఆక్రమణకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూములను, కార్యాలయాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Private people who are abducting public lands