Home తాజా వార్తలు ప్రైవేట్ బడుల్లో .. పాఠ్యపుస్తకాలు.. స్టేషనరీ దందా..

ప్రైవేట్ బడుల్లో .. పాఠ్యపుస్తకాలు.. స్టేషనరీ దందా..

విద్యాహక్కు చట్టాన్ని కాపాడుకుందాం..
బుక్ స్టాల్స్‌గా .. మారిన ప్రైవేట్ స్కూల్స్..
వనపర్తి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడి..
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్ట్, యూనిఫామ్స్, స్టేషనరీ విక్రయాలు..

Schools

 

మన తెలంగాణ/వనపర్తి కలెక్టరేట్: తమ పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్ విద్యాబోధన అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అయితే వీరి ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు, పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థులకు కావాల్సిన స్టేషనరీ, పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్ట్, యూనిఫామ్స్, స్టేషనరీ, పెన్స్, పెన్సిల్స్, రబ్బర్స్ వరకు పాఠశాలల్లో విక్రయిస్తున్నా రు. దీంతో ప్రైవేట్ పాఠశాలల కంటే కిరాణా కొట్టులే నయమని విద్యార్థుల తల్లిదండ్రులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయా లని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వనపర్తిజిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు, పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు కావాల్సిన వస్తుసామాగ్రి ,పుస్తకాలు ఉన్న ధరలకంటే రెట్టింపు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. విద్యాశాఖా ధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బయట బుక్‌స్టాల్స్‌లో పుస్తకాలు తక్కువధరలకు దొరుకుతున్నప్పటికి తమ వద్దే కొనాలని విద్యార్థు లకు, వారి తల్లిదండ్రులకు చెప్పి పాఠశాలకు వచ్చి కావాల్సిన పుస్తకాలు ,సామాగ్రి, స్టేషనరీ కొనుగోలు చేయాలని నిబంధన అమలు చేసి ఫీజులతో పాటు స్టేషనరీ, టై, బెల్ట్, బూట్లు, యూని ఫామ్స్, పెన్సిల్, పెన్నులు, ఇలా స్టేషనరీ బుక్స్, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు.

విద్యాహక్కు చట్టం హుష్‌కాకి..

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. కాని విద్యాహక్కు చట్టంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడంతో అధికారులు పట్టించు కోవడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు 25 మంది విద్యార్థులు ఉచితంగా విద్యను అందించాలి. కాని ఇప్పటి వరకు వనపర్తి జిల్లాలో ఎక్కడా ఏ పాఠశాలల్లో అమలు జరగడం లేదు. విద్యార్థులకు అవసరమైన మేరకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలి. కాని అందుకు రెట్టింపు చేసి విద్యార్థుల నుండి డబ్బులు దండుకుంటున్నారు.
విద్యాసంస్థల్లో స్టేషనరీ విక్రయాలు మానుకోవాలి..

స్టేషనరీ విక్రయించే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు ..

వనపర్తి జిల్లా పరిధిలోని మండలాల్లో స్టేషనరీ విక్రయించే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఇఒ సుశీందర్‌రావు హెచ్చరించారు. వన పర్తి పట్టణ కేంద్రంలోని మర్రికుంట సమీపంలో గల సూర్యచంద్ర పాఠశాలలో బుధవారం విద్యార్థు లకు పుస్త కాలను విక్రయిస్తుండగా డిఇఒ సుశీందర్‌రావు ఆదేశానుసారం ఎంఇఒ వెంకటేశ్వర్‌రెడ్డి పాఠ్య పుస్త కాలను నిల్వ చేసిన గదులను సీజ్ చేశారు. గురువారం ఈసందర్భంగా ఎంఇఒ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠ శాల ల్లో స్టేషనరీ నిషేధించామని తెలిపారు. ఒక వేళ స్టేషనరీ విక్రయిస్తే పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్య లు తీసు కుంటా మని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతరం పాఠశా లలో పుస్తకాలు నిల్వ చేసిన గదులను ఆయన సీజ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విక్రయాలు మానుకోవాలని ప్రతి పాఠశాల ప్రభుత్వ నిబంధనలు పాటించాలని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఎంఇఒ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులు, స్టేషనరీ ,పాఠ్య పుస్తకాలు వారి తల్లిదండ్రులు వారికి ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.

 

Private Schools Mafia in Telangana