Home తాజా వార్తలు ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా

ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా

Private travel agency Charges hike in hyderabad
చార్జీలు ఫుల్…. సౌకర్యాలు నిల్
సాంకేతిక లోపాలు వస్తే నడి రోడ్డు మీద ప్రయాణికుల పడిగాపులు
నిబంధనలు పట్టించుకోని నిర్వాహకులు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
సిటీబ్యూరో ః మితి మీరిన వేగం ,అధికబరువు ట్రావెల్స్ నిర్వాహకుల అత్యాశ వెరసి ప్రయాణికులను తరచు ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. అమవాస్యకి ,పున్నానికి అధికారులు నిర్వహించే దాడులు వారిని నిబంధనలు అతిక్రమించేలా చేస్తున్నాయి. నగరం నుంచి రోజుకు కొన్ని వందల వాహనాలు విజయవాడ, తిరుపతి, గుంటూరు ,విశాఖపట్నం, రాజమండ్రి,అమలాపురం, నెల్లూరు, కర్నాటక, బెంగుళూర్,పూనే తదితర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో ప్రయాణికులను తరలిస్తున్నాయి. కొంత మంది ట్రావెల్స్ నిర్వాహకులు బస్సులకు ట్యాక్స్ కట్టకుండా ప్రయాణికులను తీసుకు వెళ్తూ మార్గ మధ్యలో అధికారులు దాడులు నిర్వహించి వారి వేరే బస్సుల్లో తరలిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.మరి కొంత మంది నిర్వాహకులు ప్రయాణికులను సరయిన సమయంలో గమ్యస్థానాలకు చేర్చడంలో విఫలం అవుతున్నారు. శుక్రవారం సాయంత్ర బెంగుళూరులో సాయంత్రం బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ట్యాక్స్ కట్టని కారణంగా ప్రయాణికులను సుమారు 24 గంటల పాటు బస్సులో తిప్పి చివరకు నగరానికి చేర్చారు. ఇటువంటి సంఘటనలను తరచు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ముందస్తుగా ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టి నిబంధనలకు పాటించని బస్సులను సీజ్ చేసినట్లయితే ప్రయాణికులకు తిప్పలు తప్పేవి. కాని అధికారులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు కనిపంచడం లేదు.
నగరంలో సికింద్రాబాద్, ప్యారడైజ్ అప్జల్‌గంజ్, కాచిగూడ, లక్డికాపూల్, కూకట్‌పల్లి, ఈఐసీఎల్, ఎస్‌రావు నగర్, అమీర్‌పేట్, తదితర ప్రాంతాల్లో సుమారు రెండు వందల సంఖ్యకు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సాధారణ ఆర్టీసీ బస్సులతో పోలిస్తే చార్జీలు ఎక్కువైనా ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. కేవలం ప్రయాణికులను మాత్రమే ఎక్కించు కోవాల్సిన బస్సుల్లో నిబంధనలకు విరుద్దంగా వాహన బరువుకు మించి పెద్ద పెద్ద లగేజిలను బస్సులపై వేస్తున్నారు. అంతే కాదు కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పెద్ద పెద్ద వేయింగ్ మిషన్‌లను పెట్టి తూచి మరీ ఆయా బస్సులో సరుకులను రవాణా చేస్తున్నారు.అంతే కాదు భారీ యంత్రాలకు సంబంధించిన ఇనుప సామానులు సైతం ట్రావెల్స్ ఏజెన్సీలు ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు.అసలే బరువుకు మించిన లగేజి, ఆపై అర్దరాత్రి మితిమీరిన వేగం…… దీంతో వాహానం ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి పెద్ద ప్రమాదం సంభవిస్తే అందులో గాఢ నిద్రలో ప్రయాణించే ప్రయాణికులు శాశ్వత నిద్రపోయే అవకాశం వుంది. కొందరు ప్రవేట్ నిర్వాహకులు దూర ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలను బస్సుకు పక్కగా వుండే క్యాబిన్‌లలో పెడుతూ దర్జాగా ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా వాహనాల్లో ఏ మాత్రం పెట్రోల్ ఉన్నా దాంతో జరిగి ప్రమాదం ఊహాలకు కూడా అందదు.గతంలో కొన్ని ప్రమాదాలు ఈ విధంగానే జరిగి ఆమూల్యమైన ప్రయాణికులు ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి.ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు నామ మాత్రపు దాడులతో సరిపెడుతున్నారు.
చార్జీలు ఫుల్…… సౌకర్యాలు నిల్……
పెద్ద మొత్తంలో ప్రయాణికుల నుంచి చార్జీల వసూలు చేసే నిర్వాహకులు వాటి సౌకర్యాల విషయంలో నిర్లక్షంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ నిర్వాహకులు ప్రయాణికులు బస్సుల్లో ఇచ్చే మంచినీరు మొదలకుని, తినుబండారాల్లో నాణ్యత పాటించడం లేదని ప్రయాణికుల ఆరోస్తున్నారు. అందించే ఆహార పానీయాలు బ్రాండెడ్ కాక పోయినా అదే స్థాయిలో ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. బస్సు సాంకేతిక లోపాలతో ఆగిపోతే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రోడ్దు మీద పడిగాపులు గాచే విధంగా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ నార్కెట్‌పల్లి రహదారి ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు సాంకేతి లోపంతో ఆగిపోయింది. దీంతో నిర్వహాకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వారిని అదే బస్సులో ఉదయం వరకు అదే విధంగా ఉంచిన విషయం తెలిసిందే.
విచ్చల విడి పార్కింగ్‌తో భారీ ఎత్తున ట్రాఫిక్ జాం ….
నగరంలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఒక ప్రత్యేక ప్రాంతం,కాని అంటూ లేక పోవడంతో షెల్టర్ లేక పోవడంతో వారి బస్సులను తమ కార్యాలయం ముందు పెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. రాత్రి సమయాల్లో రోడ్లమీద నిలపడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా పెరిగి పోయాయి. ముఖ్యంగా అమీర్‌పేట్, లక్డికాపూల్, కాచిగూడ, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో భారీ ఎత్తును ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఇంత జరుగుతున్నా ఇటు ఆర్టీఏ అధికారులు కాని ట్రాఫిక్ అధికారులు మామూళ్ళ మత్తులో మునిగి తేలుతూ ఈ వ్యవహారాన్ని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. ఇక నైనా అధికారులు మేల్కొని ఇటు విలువైన ప్రయాణికుల ప్రాణాలను,అటు ట్రాఫిక్ అంతరాయాల నుంచి ప్రయాణికులను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది.

Private travel agency Charges hike in hyderabad