Home ఆంధ్రప్రదేశ్ వార్తలు లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ.. 10 మందికి గాయాలు

లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ.. 10 మందికి గాయాలు

Private travel bus hits lorry at west godavari

 

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తోన్న ప్రేవేట్ ట్రావెల్స్ బస్సు భీమడోలు జంక్షన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు గాయపడినవారిని 108 వాహనంలో స్థానిక దవాఖానకు తరలించారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Private travel bus hits lorry at west godavari