Thursday, April 25, 2024

పర్యాటక సంధానంతో వైమానిక వికాసం

- Advertisement -
- Advertisement -

యుపి కుషీనగర్‌లో ప్రధాని మోడీ
ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆరంభం
ఎయిరిండియా ప్రైవేటు సముచితం
ఉడాన్‌తో దేశవ్యాప్త విమానయానం

Privatization is betterment of aviation sector

కుషీనగర్ : బౌద్ధ ఆరామక్షేత్రాలను, బౌద్ధ సంబంధిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆరంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ వద్ద ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. దేశ పౌరవిమానయాన రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రధాని తెలిపారు. ఈ దిశలోనే ఎయిరిండియా ప్రైవేటీకరణ జరిగిందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని సమర్థించారు. బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీలంకకు చెందిన విమానంలో పలువురు బౌద్ధ సన్యాసులు, ప్రముఖులు ఇక్కడికి రావడంతో అధికారికంగా లాంఛనప్రాయంగా ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టం ప్రధాని సమక్షంలో జరిగింది. రూ 260 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. పర్యాటక రంగాన్ని చారిత్రక విశేషాల సమాహారంగా కూడా చేయడం ద్వారా ప్రజలకు సంబంధిత ప్రాంతాల పర్యాటక రంగానికి మేలు జరుగుతుందని ప్రధాని మోడీ తెలిపారు. విమానం ద్వారా ఇక్కడికి వచ్చిన బౌద్ధ భిక్షకులకు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఇతరులు స్వాగతం పలికారు. బుద్ధుడి అంతిమ నిర్వాణ ఘట్టం జరిగిన ప్రదేశం ఈ ప్రాంతమే అని, ఇక్కడనే మహా పరినిర్వాణ పొందారని, ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ విశ్వాసాలకు సంబంధించిన వారికి ఇది అత్యంత ప్రధాన కేంద్రం అవుతుందని, దీనిని గుర్తించే కేంద్రం, యుపి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెలకొల్పినట్లు ప్రధాని వివరించారు. యుపి తూర్పు ప్రాంతంలోని కుషీనగర్ గోరఖ్‌పూర్‌కు 50 కిలోమీటర్లు, వారణాసికి 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. భగవాన్ బుద్ధుడే భారతదేశ రాజ్యాంగానికి స్ఫూర్తి, ప్రేరణ అని ప్రధాని ఇక్కడ తెలిపారు. జాతీయ జెండాలోని ధర్మ చక్రం దేశానికి ధర్మపథపు చోదక శక్తి అని చెప్పారు. బుద్ధుడు కలకాలపు సత్యాలను ఆవిష్కరించారని, ఆయన అంతర్ముఖత, ప్రవచనాత్మకత ప్రపంచం అంతా ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. ఆ మహానుభావుడి తత్వం అత్యున్నత స్థాయి ప్రశాంతతను తెచ్చిపెట్టే బాధ్యతాయుతత్వాన్ని ఆపాదించిందన్నారు.

వైమానిక రంగ బాగుకోసమే ప్రైవేటీకరణ

ప్రైవేటీకరణతో విమానయాన రంగం బాగుపడుతుందని నిర్థారించుకున్న తరువాతనే ఇటీవల ఎయిరిండియా ప్రైవేటీకరణ జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ రంగం వృత్తిపరమైన మెళకువలు, నష్టనివారణ జాగ్రత్తలతోసాగాల్సి ఉంటుంది. ఈ విధంగా వైమానిక రంగంలోని సంస్థలు ప్రొఫెషనలిజం ప్రదర్శించాల్సి ఉంటుంది, ప్రయాణికుల సౌకర్యం, ప్రయాణ భద్రతకు ప్రాధాన్యత అత్యవసరం అని, ఈ కోణాలలోనే ఎయిరిండియా ప్రైవేటీకరణ జరిగిందని ప్రధాని ఈ కీలక నిర్ణయం గురించి తెలిపారు. వైమానిక రంగానికి సంబంధించి పలు సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. రక్షణ గగనతలాన్ని కూడా పౌరవైమానిక వాడకానికి తెరవడం వంటి నిర్ణయాలను సంస్కరణలలో భాగంగా ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించిన రూ లక్ష కోట్ల పిఎం గతిశక్తి జాతీయ బృహత్తర పథకం గురించి కూడా ప్రస్తావించారు. దేశంలో పౌరవిమానయానం మరింతిగా విస్తరిస్తుందని తెలిపారు. ఉడాన్ స్కీంను ప్రధాని ప్రస్తావించారు. ఈ పథకం పరిధిలో గత కొంతకాలంగా 900 కొత్త రూట్లకు ఆమోదం తెలిపారు. వీటిలో 350కి పైగా విమాన రూట్లు ప్రయాణాలతో సాగుతున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News