Home తాజా వార్తలు నారప్ప… ప్రియమణి లుక్ విడుదల

నారప్ప… ప్రియమణి లుక్ విడుదల

Priyamani Look Released from Narappa filmహైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా అసురన్ కు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళ వెర్షన్ లో ధనుష్ హీరోగా నటించారు. దళిత కథ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. తమిళంలో హిట్ గా నిలిచిన అసురన్ ను నారప్ప పేరుతో తెలుగులో తీస్తున్నారు. నారప్పలో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన ప్రియమణి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వెంకటేష్ లుక్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె లుక్ ను విడుదల చేశారు. ప్రియమణి ఎడ్ల బండిపై కూర్చొని గ్రామీణ యువతిగా ఆమె కనిపిస్తోంది. ప్రియమణి లుక్ సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రత్యేక  పాత్రలో మలయాళ నటి రెబ్బా మోనిక నటిస్తోంది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సైతం ఈ సినిమా సూపర్ హిట్ కానుందని వెంకటేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.