Friday, March 29, 2024

కర్ణాటకలో ‘లంచం.. మంచం ప్రభుత్వం’

- Advertisement -
- Advertisement -

Priyank Kharge comes down heavily on BJP govt

మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై దుమారం

బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలని, యువతులైతే మరో రకంగా సహకరించాలని మాజీ మంత్రి , ఎమ్‌ఎల్‌ఎ ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తనయుడైన ప్రియాంక్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. కలబురిగిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ఉద్యోగాలను తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని తాను “లంచంమంచం ప్రభుత్వమని” అనేందకు సంకోచించనని వ్యాఖ్యానించారు. ఎస్సై నియామకాలకు నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలతో మూడు లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మగాళ్లు అయితే లంచం ఇవ్వాల్సి వస్తోందని, యువతులు అయితే మరో రకమైన ఒత్తిడి వస్తోందంటూ పేర్కొన్నారు. అక్రమాలను బయటపెట్టిన తనను సీఐడీ అధికారులతో నోటీసులు పంపించి బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.

బీజేపీ ఎదురుదాడి..
ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బిజెపి ఎదురుదాడి చేసింది. ఇలాంటి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన అనేక సీడీలు ఉన్నాయని ఆరోపించింది. బీజేపీ సర్కారుపై విమర్శలు చేసే ముందు ఆ జాబితాను బయటపెట్టండి అంటూ ఖర్గేను డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మహిళలు ఎంతో కష్టపడుతున్నారని, అలాంటి వారిని అవమానించే రీతిలో ఖర్గే వ్యాఖ్యలు చేశారని, వెంటనే మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News