Friday, January 27, 2023

హాలీవుడ్ మోజులో ప్రియాంక

- Advertisement -

Priyanka Chopraబాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ససేమిరా అనేస్తోందట ప్రియాంకా చోప్రా. గత ఏడాది ఈ బ్యూటీ.. “2017లో పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెడతా…”అని పలు ఇంటర్వూలో చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం హిందీ సినిమాల్లో నటించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని బాలీవుడ్ సినీ జనాలు అంటున్నారు. హాలీవుడ్ మోజులో ప్రియాంక పడిపోయిందనీ, ఆమె తిరిగి బాలీవుడ్‌లోకి రావడం అంత సులువు కాదని చెబుతున్నారు. ‘క్వాంటికో’ టివి సీరీస్‌తో హాలీవుడ్ ప్రేక్షకులకు ఈ భామ దగ్గరైంది. ఆమె చేసిన ‘బేవాచ్’ సినిమా ఇంకా విడుదలకావాల్సి ఉంది. ‘క్వాంటికో’ పుణ్యమా అని తనకు బాలీవుడ్‌లోకన్నా హాలీవుడ్‌లోనే ఎక్కువ పాపులారిటీ దక్కిందని మురిసిపోతున్నట్టుంది. హాలీవుడ్‌లో ఎంట్రీ ఎంత కష్టమో… అక్కడ నిలదొక్కుకోవడం అంతకన్నా కష్టం. లక్కీగా ప్రియాంకకు అక్కడ మంచి గుర్తింపే లభిస్తోంది. ముందు ముందు హాలీవుడ్‌లోనే సెటిలైపోవాలనిపించేంతలా అక్కడి వాతావరణం తనకు నచ్చిందటూ ప్రియాంక తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. మరోపక్క ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ భామ డేట్స్ కోసం వెళ్తే… “ప్రస్తుతానికైతే డేట్స్ ఖాళీగా లేవు. హాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాను” అని ప్రియాంక సమాధానమిచ్చిందట. దాంతో ఆ నిర్మాత షాక్‌కు గురయ్యాడట. 2017లో ఖచ్చితంగా రెండు బాలీవుడ్ సినిమాలైనా చేస్తానంటూ ఇండియన్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వూల్లో చెబుతున్న ప్రియాంక… పైకి చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు పొంతనలేనట్టే వ్యవహరిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles