Home జాతీయ వార్తలు కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన : ప్రియాంక గాంధీ

కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన : ప్రియాంక గాంధీ

Priyanka Gandhiఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తుందని జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. దీన్ని దేశ ద్రోహంగా భావించవచ్చని ఆమె పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజల సమస్యలను తెలుసునేందుకు అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ బృందాన్ని శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపడం అన్యాయమని ఆమె చెప్పారు. జాతీయవాదం పేరిట కశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. కశ్మీర్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని విభజించడం, ఆర్టికల్ 370 ను రద్దు చేయడం దారుణమని, ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె కోరారు. దేశ ప్రజలు కశ్మీర్ ప్రజలకు అండగా నిలబడి, వారికి పూర్తి మద్ధతు ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. నిఘా నేత్రాల మధ్య కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుని, ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె డిమాండ్ చేశారు.

Priyanka Gandhi Comments On Kashmir Issue