Home జాతీయ వార్తలు ఇంటర్ పాసైతే స్మార్ట్‌ఫోన్, డిగ్రీ పాసైతే ఇ- స్కూటర్

ఇంటర్ పాసైతే స్మార్ట్‌ఫోన్, డిగ్రీ పాసైతే ఇ- స్కూటర్

Priyanka gandhi promises smartphones, E-scooty for girls

 

యుపి బాలికలకు ప్రియాంక గాంధీ వాగ్దానం

లక్నో: రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినులందరికీ స్మార్ట్‌ఫోన్ అందచేస్తామని, అలాగే గ్రాడ్యుయేషన్ పాసైన విద్యార్థినులకు ఎలెక్ట్రానిక్ స్కూటీ అందచేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వాగ్దానం చేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన మరుసటి రోజే ప్రియాంక బాలికలకు ఈ వాగ్దానం చేయడం విశేషం. తాను నిన్న కొందరు బాలికలను కలిశానని, తమ చదువులు, భద్రత కోసం స్మార్ట్‌ఫోన్లు కావాలని వారు తనను కోరారంటూ ప్రియాంక గురువారం ట్వీట్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ఇంటర్ పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ పాసైన విద్యార్థినులకు ఎలెక్ట్రానిక్ స్కూటీలను ఇవ్వాలని ఎన్నికల మ్యానిఫెస్టో అనుమతితో యుపి కాంగ్రెస్ నిర్ణయించిందని తెలియచేయడానికి తాను సంతోషిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తనతో బాలికలు ముచ్చటిస్తున్నప్పటి వీడియోను కూడా ప్రియాంక తన ట్వీట్‌తో జతచేశారు.