Home జాతీయ వార్తలు 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం

370 రద్దు రాజ్యాంగ విరుద్ధం

Priyanka-Gadhi

సోన్‌భద్ర(యుపి) : జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దుచేసిన తర్వా త మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మొదటిసారిగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన విధానం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమ ని, ఉత్తరప్రదేశ్‌లోని ఉంబా గ్రామంలో పర్యటించిన అనంతరం ప్రియాంక విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఉన్నాయని, వాటిని ప్రభు త్వం పాటించడం లేదన్నారు. తమ పార్టీ ఎప్పు డూ రాజ్యాంగాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఒకే గొంతు క వినిపించే బిజెపికి కంటే భిన్నం గా, తమ పార్టీలో ప్రతి గొంతుకకు ప్రాముఖ్యత ఉంటుందని, ఒక నిర్ణయానికి వచ్చే ముందు దానిపై పూర్తిగా చర్చ జరుగుతుందని ప్రియాంక పేర్కొన్నారు. ఓ భూవివాదంలో 10 మంది గిరిజనులను హత్య చేసిన దాదాపు నెల రోజుల తర్వాత ఆమె ఉంబా గ్రామాన్ని సందర్శించారు. గతంలో ఈ గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రియాంకను యుపి ప్రభుత్వం మీర్జాపూర్ వద్ద అదుపులోకి తీసుకుంది. కాగా, ఆమె పర్యటనను ‘రాజకీయ స్టంట్’గా యుపి డిప్యూ టీ చీఫ్ మినిస్టర్ దినేశ్ శర్మ అభివర్ణించారు.

Priyanka Gandhi visits Sonbhadra