Friday, March 31, 2023

నీరవ్ సంస్థకు ప్రియాంక గుడ్‌బై

- Advertisement -

priyanka

ముంబై : నీరవ్ మోడీ వజ్రాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు ఆ కంపెనీతో తన కాం ట్రాక్టును తెగదెంపులు చేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్ తరపున ఆమె ప్రతినిధి వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)కు నీరవ్ మోడీ సంస్థ సుమారు 11,400 కోట్లు ఎగ్గొట్టగా, ఈ కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీ ఆభరణాలకు ప్రియాంక గతంలో ప్రమోషన్ చేసింది. సిద్ధార్థ్ మల్‌హోత్రాతో కలిసి నీరవ్ మోడీ బ్రాండ్ కు సంబంధించిన టివి వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. ‘అనేక ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నీరవ్ మోడీతో వాణిజ్యపరమైన కాంట్రాక్టును ప్రియాంక చోప్రా వదులుకోవాలిని నిర్ణయించుకున్నారు’ అని ఆమె ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కాగా, ఇప్పటికే నీరవ్ మోడీతో తన కాంట్రాక్టు ముగిసిందని, దీనిపై తాను ఎలాంటి న్యాయపరమైన చర్యలు చేపట్టదల్చుకోలేదని ఇటీవల పిటిఐతో మాట్లాడు తూ సిద్ధార్థ్ మల్‌హోత్రా చెప్పాడు. అలాగే, మోడీ మేనమావ మెహుల్ చోక్సీకి చెందిన బ్రాండ్‌తో తన కాం ట్రాక్టు ముగిసినప్పటికీ తన ఫొటోలను ఇప్పటికీ ప్రకటనల్లో వాడుతున్నారని మరో బాలీవుడ్ నటి బిపాసా బసు తెలిపింది.
బ్యాంకు ఖాతాలు, షేర్ల స్తంభన : నీరవ్ మోడీకి చెందిన బ్యాంకు డిపాజిట్లు, రూ.44 కోట్ల విలువైన షేర్లను స్తంభింపజేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం నాడు వెల్లడించింది. దీంతో పాటు విలువైన విదేశీ వాచీలను జప్తు చేసినట్టు తెలిపింది. నగదు అక్రమ రవాణా నియంత్రణ చట్టం కింద నీరవ్ మోడీకి చెందిన రూ.30 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని అధికారులు చెప్పారు. విలువైన విదేశీ గడియారాలు, 176 స్టీలు అల్మరాలు, 158 బ్యాక్సు లు, 60 ఇతర కంటైనర్లు తదితరాలను గత వారం రోజులుగా నిర్వహించిన దాడుల్లో గుర్తించి జప్తు చేశామన్నారు. గురువారం నాడు రూ.100 కోట్ల విలువైన లగ్జరీ కార్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News