Home తాజా వార్తలు కష్టాల కడలిలో బాసర ట్రిపుల్‌ఐటి…

కష్టాల కడలిలో బాసర ట్రిపుల్‌ఐటి…

Basara IIIT

 

వెంటాడుతున్న సమస్యలు
ప్రతి యేటా ఏదో ఒక సంచలనం
నిర్వహణ లోపమే విద్యార్థులకు శాపం
ఇష్టాను రీతితో ప్రవరిస్తున్న అధ్యాపకులు
శాశ్వత వీసీ లేక … పక్కదారిలో పాలన

బాసర : ఉత్తర తెలంగాణలో పేదింటి విద్యార్థులకు కళల చదువు కల్పతరువు నిలుస్తున్న బాసర ట్రిపుల్‌ఐటిలో సాక్షా చదువులమ్మ కోలువు దీరిన చోట 2008లో కళాశాలను నిర్మించినప్పటికి ప్రశాంతమైన వాతవరణంలో విద్యక్షేత్రం కొలువైంది.  7వేల మంది విద్యార్థుల కళల ప్రపంచం ఇది. కళాశాలలో8కోర్సులు పీయూసీ, ఈసీ ఈఈఈ, కెమికల్, ఎంఎంఈ, సీవిల్, మెకానికల్, సీఈసీ కోర్సులుండగా రెగ్యూలర్ అధ్యాకులు 21, కాంట్రాక్టు అధ్యాకులు 120 మంది ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఆశయాలతో వచ్చి పేదింటి విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుస్తుంది.

అలాంటి రాజీవ్ గాంధీ యూనీవర్సిటి ఆప్ నాలెడ్జ్ టెక్నాలజీస్టు కళాశాలలో కొన్ని సంవత్సరాలుగా ఈ కళాశాలకు శాశ్వత వీసి లేక పాలనతో నెట్టుకొస్తుంది. ఇంచార్జీ బాధ్యతులు తీసుకున్న నెల, లేదా రెం నెలకొక్కసారి కళాశాలను సందర్శించా అరకొర పర్యవేక్షణ చేపడుతుండడంతో క్యాంప్‌లో ఇష్టాను రీతిలో నడుస్తుంది. అవినీతి అక్రమాలకు కళాశాల నిలయంగా మారి పలు మార్లు ఆరోపణాలు ఎదుర్కొన్న బాసర ట్రిపుల్‌ఐటిలో తాజాగా కిచక చేష్టాలు చేపడుతున్న అధ్యాపకులపై వెలుగులోని రావడంతో కళాశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థీనీల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

కళాశాలలో వెంటాడుతున్న సమస్యలు
బాసర ట్రిపుల్‌ఐటిలో 7వేలపైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్పప్పటికి గత సంవత్సరం సమదుస్తులు ఆలస్యంగా వచ్చినప్పటికి, విద్యార్థీనీలకు అనేక సమస్యలు ఉన్న గానీ పట్టించుకోవడం కళాశాల విఫలమవుతుంది. గతంలో కూడా విద్యార్థీనీలపై కీచకపర్వం చేపడుతు న్న సాక్షాత్తు కళాశాల అధ్యాపకులు ఇలా చేస్తే కొందరి విద్యార్థీనీలు తల్లిదండ్రులకు, అధ్యాపకులకు చె ప్పుకోలేని వైనం మారింది. ఇదిలా ఉండగా కళాశాలలో విద్యార్థీనీలు ఆత్మహత్యలకు పాల్పడడంతో అసలు కారణాలు తెలియరాలేదు. అటు అధ్యాపకుల వేధింపు ల..? కళాశాల యాజమన్యం లోపమా ..? అనే అర్థ కాని రీతిలో ఉంది. ఇప్పుడు కూడా మంచినీటితోపాటు కళాశాలలో అనేక సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. భొజనాలయంలో సరైన మోను ప్రకారం ఆహారం అందించకపోవడంపై కోంద విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసి ఆస్పత్రులకు పాలైన సంఘటనాలున్నాయి.

ఇష్టాను రితీలో ప్రవరిస్తున్న అధ్యాపకులు
ఉన్నత ఆశయాలతో క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థీనీల జీవితాలతో అడుకునే విషనాగులాంటి అధ్యాపకులు ఇక్కడ ఉన్నారు. పదో తరగతి లో మంచి మార్కులను సాధించి బాసర ట్రిపుల్‌ఐటిలో ప్రవేశం పోంది. పేదింటి బిడ్డల జీవితాలతో ఆడుకునే వారు దాపురించారు. తా జాగా శనివారం వెలుగులోనికి వచ్చిన ఘటన క్యాంపస్‌లో కొందరు అధ్యాపలు వికృత చేష్టాలతో అద్దం పట్టింది. కెమిస్ట్రి విభాగ అధిపతి గా ఉన్నత స్తానంలో ఉన్న డాక్టర్ రవి వరాల చేసిన పని అధ్యాపక వృత్తిని తల దించుకునే చేసింది. పరీక్షల్లో ఫైయిల్ అయ్యిన విద్యార్థినీల అమయాకత్వాన్ని ఆసరగా తీసుకోని సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తు కళాశాల వార్డేన్‌కు అడ్డంగా దొరికిపోయాడు.

ఈ మేరకు ఆయనను విధు లనుండి తోలగించడంతోపాటు కేసులను నమోదు చేశారు. ఇకా ఇలాంటి కీచక చేష్టాలతో పైశాచిక ఆనందం పోందుతున్న వారు మరి కొందరు ఉన్నరన్న ఆరోపణాలున్నాయి. దొరికితేనే దొంగ… లేదంటే దొర అన్న రీతితో వీరు చేస్తున్న కథలు భయటపడకపోవడంతో గుట్టుగా ఉన్నాయి. అప్పటి మాజీ వీసి ఇక్కడ పని చేయడంతో వారి సొంత బంధువులను కళా శాలలో అధ్యాపకులుగా చేర్పించి వారికి కళా శాల స్థితి గతులను సైతం అప్పగించారు. గతంలో కూడా ఓ అధ్యాపకునిపై లైంగిక వేధింపుల ఆరోణాలు రాగా , అటు రాజాకీయా ప్రోత్భలంతో చేసిన సంఘటనాలు బయట పడకుండా చూసుకున్నారు.

శాశ్వత వీసిలేక… పక్కదారిపాలన
పేదకుటుంబాలు సర్కార్ బడుల నుండి వచ్చే ఆణీముత్యాలకు ఉన్నత విద్యను అందించి ఉన్నత స్థానాలకు చేర్చాలన్నా ఆశయంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీ తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ఉండగా గడిచిన ఐదున్నర యేళ్లుగా ఇంచార్జీ వీసీలతో నెట్టుకరావడం గమనార్హం. శాశ్వత వీసి లేకపోవడంతో ఇక్కడ పరిపాలన పక్కాదారి పడుతున్నట్లు చెప్పవచ్చు. విశ్వవిద్యాలయంలో స్వయం ప్రతిపత్తి రెగ్యూలార్ వీసి ఉండాలన్న డిమాండ్ కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న పట్టించుకోవడం లేదు. కళాశాలపై ఇప్పటికి సీతాకన్ను కొనసాగుతుంది.

గతంలో ఉస్మానీయా విసీ గా పనిచేసిన సత్యనారయణను ఇంచార్జీగా నియమించారు. ఇక్కడ ఆయన మూడేళ్లు పనిచే శారు. ప్రసుత్తం ఇంటర్మీడియట్ కార్యదర్శి గా ఉన్న అశోక్‌కుమార్‌గా ఇంచార్జీ వీసిగా బాధ్యతలను అప్పగించారు. వారు హైదరబాద్‌లోని కీలకమైన విధులు నిర్వహించి యూనీవర్సీటి బాధ్యతలను పర్యవేక్షించం ఎంతో ఇబ్బందిగా మా ఇక్కడ రోజువారి వ్యవహరాలను పరిశీలించడానికి సమస్యల మారి దీంతో విద్యా ర్థు ప్రగతి నీవేదికలను సైతం దగ్గరుండి పర్యవేక్షణ అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్దాయిలో వైస్ చాన్సులార్‌ను నియమిస్తు యూ విద్యఅభివృద్ధి కృషి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యతోపాటు బోధన వసతిపై దృష్టిసారించే అవకాశం ఉంటుంది.

ప్రత్యేక కమీటితోనే
కళాశాలలోని కష్టాలు దూరం
ట్రిపుల్‌ఐటీ కళాశాలలో సుమారు 7వేలపైగా విద్యార్థీనీ, విద్యార్థులు బీటెక్ సమీకృత విద్యను అభ్యసిస్తున్నప్పటికి పరిపాలన లోపం ఉంది. దీంతో కళాశాలలో ప్రత్యేక కమీటిని నియమిస్తే విద్యార్థుల కష్టాలు దూరమవుతాయని స్థానికులు, పోషకులు అంటున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన డాక్టర్ అశోక్ కుమార్ కమీటి చైర్మన్‌గా ఉండి వారితోపాటు ఆర్డీవో, కోర్టు జడ్జీ, తహసీల్దార్, స్థానిక ప్రజా ప్రతినిదులతో కలిసి ప్రతి నెల విద్యాలయాన్ని సందర్శించి కళాశాలలో భోజనాలయంతోపాటు తరగతు గదులను సైతం పర్యవేక్షించే వారు. అనంతరం విద్యార్థీనీ, విద్యార్థులతోపాటు అధ్యాపకులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసిన విద్యార్థీనీల సమస్యలను అడిగి తెలు సుకోని సతర్వమే పరిష్కరించే వారు. ఇప్పుడు కూడా ఇటువంటి కమీటితో సమస్యలను పరిష్కరించడానికి తగిన న్యాయం జరుగుతుందని, తల్లిదండ్రులు,స్థానిక ప్రజా ప్రతినిధులు అంటున్నారు.

Problems in Basara IIIT