Sunday, March 26, 2023

దృఢసంకల్సంతో ముందుకు

- Advertisement -

kadiyam*బంగారు తెలంగాణే లక్షంగా ప్రజా సంక్షేమ పథకాలు
*అందులో భాగంగానే రూ.16వేల కోట్ల పంట రుణాల మాఫీ
*24గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు
*ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి

మన తెలంగాణ/నర్సంపేట: గత ప్రభుత్వాల హయాంలో నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటే రాష్ట్రం ఆవిర్భవించిన మూడున్నర సంవత్సరాల అనతికాలంలోనే కెసిఆర్ దేశంలో తెలంగాణను అత్యున్నతస్థానంలో ఉంచాలనే  దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామం లో సర్పంచ్ సున్నపు కోమ్మాలు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి పల్లెప్రగతితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకువెళ్తున్నాడని అన్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్షంతో ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాడని తెలిపారు. అందులో భాగంగానే రూ.16వేల కోట్ల పంటరుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు ఖరీఫ్‌కు, రబీకి 8వేలు పెట్టుబడి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపా రు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఉచితంగా 24గంటల కరెంటు ఇవ్వడంలేదని అదే మన ముఖ్యమంత్రి జనవరి 1, 2018 నుంచి రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటును అందిస్తున్నట్లు తెలిపారు. 40లక్షల మందికి రూ.5వేల300 కోట్ల ఆసరా, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రూ.200పింఛన్లు అందిస్తే కెసిఆర్ రూ.వెయ్యి ఆసరా, వికలాంగులకు రూ.1,500 అందిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నా రు. ఆడపిల్లలకు మేనమామలా కల్యాణలక్ష్మి అమలుచేసి రూ.75, 116ను అందిస్తున్నామన్నారు. గర్భిణులకు రూ.12వేలు, పుట్టి న పిల్లలకు కెసిఆర్ కిట్ అందిస్తున్నట్లు వివరించారు.

70 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మిషన్ భగీరథ పథకంతో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఓట్లురాగానే అరచేతిలో వైకుంఠం చూపిస్తామనే నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలు పనిచేసే నాయకులకే పట్టం కట్టాలని సూచించారు. ఇటుకాలపెల్లి శివారు ఇప్పల్‌తండాలో ఫ్లోరైడ్ బాధితుల కోసం వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మహిళలకు రూ.20లక్షలతో కమ్యూనిటీ హాల్, ప్రైమరీ స్కూ ల్‌కు అదనపు గదులతోపాటు కిచన్, ప్రహరీ మం జూరు చేస్తున్నట్లు పల్లెప్రగతి సభలో కడియం హామీనిచ్చారు. ప్రభుత్వం విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో 92శాతం బడు గు, బలహీనవర్గాలకు సరైన ఫలాలు అందితేనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందుకే కెసిఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చేపట్టిన పల్లెప్రగతితో నర్సంపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెం దుతుందన్నారు. ప్రతీ పల్లెలో మౌళిక వసతులు కల్పించేందుకే పల్లెప్రగతి చేపట్టామని పెద్ది సుదర్శన్‌రెడ్డి వివరించారు. ప్రతి గ్రామంలో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌భగీరథ, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, ఉచితంగా 24గంటల కరెంటు కల్యాణలక్ష్మి, ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమ లు చేస్తూ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. ఇటికాలపెల్లి, గ్రామశివారు పల్లెల్లో, తండాలలో రూ.9కోట్ల అభివృద్ధి పనులకు వెచ్చించినట్లు తెలిపారు. అనంతరం రాజుపే ట గ్రామంలో కడియం శ్రీహరి నూతన గ్రామపంచాయతీని ప్రారంభించారు. ముత్తోజిపేట గ్రామంతోపాటు శివారు పల్లెల్లో సుదర్శన్‌రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, జడ్పి చైర్‌పర్సన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్య, ఎంపిటిసిలు కట్ల సుధాకర్, లావణ్య రాంప్రసాద్, గుంటి కిషన్, గంప రాజేశ్వర్, పుట్టపాక కుమారస్వామి, గోనె యువరాజు, మోతే జయపాల్‌రెడ్డి, దార్ల రమాదేవి, బైరి మురళి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News