Thursday, April 25, 2024

నేను అదే నమ్ముతా: ‘అఖండ’ నిర్మాత

- Advertisement -
- Advertisement -

‘జయజానకీ నాయక’ సినిమాతో నిర్మాతగా పరిచయమై మొదటి సినిమాతోనే అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ అఖండ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు. బుధవారం నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే…
పెద్ద డైరెక్టర్, అరుదైన కాంబినేషన్ అనే నమ్మకంతోనే అఖండ సినిమాను చేశాను. ఒకప్పుడు ఒక్క డైరెక్టరే పది సినిమాలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ దర్శకుడు ఒక సినిమాను చేయడమే కష్టం. స్టార్ హీరోలకు పది ప్లాఫులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే సెట్ అవుతుంది. స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే. నేను అదే నమ్ముతా.
నాకు ముందే తెలుసు…
అఖండ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని నాకు ముందే తెలుసు. సినిమా విడుదల కంటే ముందు నుంచి నేనే మాట్లాడుతూ వచ్చాను. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన మాస్ అంశాలు ఉన్నాయి. అఘోర పాత్ర అద్భుతంగా వచ్చింది. అఖండ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాం. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఉంది.
వంద రెట్లు ఎక్కువ ఇచ్చారు…
అఖండ సినిమా కథ విన్నప్పటి నుంచి మా మైండ్‌లో తమనే ఉన్నారు. ఇలాంటి మంచి మ్యూజిక్ ఇస్తాడని నాకు ముందే తెలుసు. ‘బాలకృష్ణతో మనం చేస్తున్నాం.. నన్ను తొందరపెట్టొద్దు. పగలగొట్టేద్దాము’అని తమన్ అన్నారు. తమన్ ఏం చెప్పారో దాని కంటే వంద రెట్లు ఎక్కువ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ పాత్ర చాలా ముఖ్యమైంది.
సీక్వెల్ తీయాలనుంది…
దర్శకుడు బోయపాటి శ్రీను రాబోయే సినిమాల్లో నేను భాగస్వామిని అవుతానా? లేదా? చెప్పలేను. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాకు కూడా ఉంది. ఒక వేళ హిందీలో రీమేక్ చేయాలనుకుంటే.. ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది.
తదుపరి చిత్రాలు…
వచ్చే ఏడాది మార్చిలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతున్నాను. ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశలోఉంది.

Producer Miryala Ravinder Reddy Interviews

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News