Home తాజా వార్తలు రష్మిక మందనపై నిర్మాతల ఆగ్రహం

రష్మిక మందనపై నిర్మాతల ఆగ్రహం

Rashmika Mandanaచెన్నయ్ : ప్రముఖ నటి రష్మిక మందనపై సుల్తాన్ సినిమా నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారు. తమ పర్మిషన్ లేకుండా తాను నటిస్తున్న సినిమా పేరును రష్మిక బయటపెట్టింది. దీంతో నిర్మాతలు ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగులో బిజీగా ఉన్న రష్మిక కోలీవుడ్ లోనూ సత్తా చాటాలన్న ఆలోచనతో ఉన్నారు. కోలీవుడ్ హీరో కార్తికి జంటగా ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్, నిర్మాతలు ఉన్నారట. ఈ క్రమంలో రష్మిక సోషల్ మీడియాలో ‘సుల్తాన్’ సినిమా షూటింగ్ లో నాల్గోరోజు అంటూ పోస్టు పెట్టింది. దీంతో ఈ సినిమా పేరు సుల్తాన్ అని తెలిసిపోయింది. తమ అనుమతి లేకుండా ఇలా సినిమా టైటిల్ పై ప్రకటన చేయడం ఏమిటని నిర్మాతలు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Producers Angry On Actress Rashmika Mandana