Home జాతీయ వార్తలు స్పా సెంటర్‌లో వ్యభిచారం

స్పా సెంటర్‌లో వ్యభిచారం

Prostitution in the Spa Center at Delhi

ఢిల్లీ : స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 12మందిని గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు. సెక్టార్ -29లో ఉన్న ఓ స్పా సెంటర్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ఆ సెంటర్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో థాయిలాండ్‌కు చెందిన ఐదుగురు మహిళలతో పాటు మణిపూర్‌కు చెందిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు విటులను కూడా అరెస్టు చేశారు. వీరిపై ఐపిసి, ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని, స్పా సెంటర్ ఓనర్ యుద్‌వీర్‌సింగ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Prostitution in the Spa Center at Delhi