Friday, March 29, 2024

రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ

- Advertisement -
- Advertisement -

Protection from Delta with two doses

ఫ్రాన్స్ వైద్య నిపుణుల అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందాలంటే పూర్తి స్థాయిలో టీకా వేయించుకోవాలని, ఒకే డోసుతో చాలునని అనుకోకుండా రెండు డోసులు పొందితే డెల్టాతోపాటు అల్ఫా, బీటా, రకాల నుంచి రక్షణ లభిస్తుందని ఫ్రాన్స్ వైద్య నిపుణుల అధ్యయనం వెల్లడించింది. గతంలో కొవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితులకు ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా టీకాల ఒకే డోసు ఇవ్వగా ఫలితం కనిపించలేదని, డెల్టా లక్ష్యంగా చేసుకునే యాంటీబాడీలు పెద్దగా ఉత్పత్తి కాలేదని అధ్యయనం వెల్లడించింది. ఒకే డోసు పొందిన వారిలో 10 శాతం మంది మాత్రమే డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోగలరని వెల్లడి కాగా, రెండో డోసు పొందాక 95 శాతం మందికి రక్షణ లభిస్తున్నట్టు తేలిందని అధ్యయనం వివరించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో సహజ సిద్ధంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీలు డెల్టా రకం విషయంలో 4.6 రెట్లు తక్కువగా సామర్ధ్యాన్ని చూపుతున్నాయని గుర్తించారు. వీరు ఒక డోసు పొందితే రక్షణ పెరుగుతుందని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News