Thursday, April 25, 2024

నిరసన మీ హక్కు.. కాని రోడ్లపైన కాదు: సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం భావాల వ్యక్తీకరణ ఆధారంగా పనిచేస్తుందని, అయితే దీనికి కొన్ని హద్దులు ఉన్నాయని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. సిఎఎ, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ రోడ్డును అడ్డగించి సాగుతున్న నిరసన ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ నిరసనలు తెలియచేయకూడదని కోర్టు ప్రశ్నించడం లేదని అయితే తమ ప్రదర్శనలు ఎక్కడ చేయాలన్నదే ఇక్కడ ప్రశ్న అని పేర్కొంది. నిరసనకారులను కలసి వారితో మాట్లాడవలసిందిగా సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది సాధనా రామచంద్రన్‌ను కోరిన సుప్రీంకోర్టు నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపవలసిందిగా ఢిల్లీ పోలీసులకు సూచించింది. నిరసన హక్కు ప్రజలకు ఉందని, అయితే ఆందోళనలను ప్రజలు ఉపయోగించే రోడ్డుపైన లేదా పార్కులో చేయకూడదని కోర్టు పేర్కొంది. ఆందోళనలు జరుపుకునేందుకు ఉద్దేశించిన ప్రదేశంలో నిరసనలు తెలుపుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Protestors can’t block roads: Supreme Court 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News