Home తాజా వార్తలు ఆందోళన వద్దు.. అందరికీ ఆర్థిక సాయం

ఆందోళన వద్దు.. అందరికీ ఆర్థిక సాయం

Protests erupt across Hyderabad over flood relief

 

ప్రతి అర్హుడికి రూ.10 వేలు అందజేస్తాం
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు అందాయి
వరద బాధితులకు మంత్రి కెటిఆర్ భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని.. ఎవరూ ఆందోళన చెందొద్దని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, జిహెచ్‌ఎంసీ అధికారుల సహాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ ఆర్థిక సహాయం అందించామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అన్నారు. అయితే శనివారం పలు ప్రాంతాల నుంచి తమకు ఇంకా ఆర్థిక సహాయం అందలేదని కొంతమంది చేస్తున్న విజ్ఞప్తులు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సహాయం అందిం చాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నం అన్నారు.

పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి విశాల దృక్ఫథంతో వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందించాలని తమకు ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ఇప్పటికీ ఇంకా ఎవరికైనా అర్హులైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందకుంటే, మరికొద్ది రోజుల పాటు వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ఈ మేరకు జిహెచ్‌ఎంసి అధికారులతో, హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంపైన సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

Protests erupt across Hyderabad over flood relief