Tuesday, January 31, 2023

104 శత పరంపర

వాహకనౌక : పిఎస్‌ఎల్‌వి-సి37
వేదిక: శ్రీహరికోటలోని షార్, సమయం : బుధవారం ఉదయం 9:28 గంటలకు, ఉపగ్రహాల సంఖ్య : 104
ఏయే దేశాలవి, ఎన్నెన్ని: భారత్ (3 ఇందులో ఒకటి కార్టోశాట్-2, రెండు నానో శాటిలైట్స్)
అమెరికా(96) ఇజ్రాయెల్, కజకిస్థాన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, యుఎఇ ఒక్కొక్కటి.
ప్రయాణ దూరం : 524కిలో మీటర్లు
తొలుత కక్షలోకి వెళ్లింది : కార్టోశాట్-2, ఆ తర్వాత అమెరికా ఉపగ్రహాలు, వెంటనే మిగతా దేశాలవి…..
– 104 ఉపగ్రహాలను ప్రయోగించిన మొట్టమొదటి దేశం భారత్, గతంలో రష్యా అంతరిక్ష సంస్థ 37 ప్రయోగించింది, 2015, జూన్‌లో ఇస్రో 23శాటిలైట్‌లను ఒకేసారి ప్రయోగించింది.

- Advertisement -

PSLVC37 Rocket Lauchశ్రీహరికోట: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం తన అపూర్వ ప్రయో గంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇస్రో విశ్వసనీయ పోలార్ రాకెట్ పిఎస్‌ఎల్‌వి సి -37 వాహకనౌక నుంచి ఒకేసారి 104 ఉప గ్రహాలను విజయవంతంగా ప్రయోగించి శాస్త్ర జ్ఞులు అంతరిక్ష పరిశోధనా రంగంలో అగ్ర రాజ్యాలను వెనక్కి నెట్టారు. సూళ్లూరుపేటలో సతీష్ ధావన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ (షార్) నుంచి సరిగ్గా ఉదయం 9.28 గంటలకు 104 శాటిలైట్లతో పిఎస్‌ఎల్‌వి ఇస్రో నమ్మినబంటుగా నిప్పులు చిమ్ముకుంటూ, అంతా నిర్ణీతంగా, శాస్త్రజ్ఞలు అంచనాలు, శాస్త్రీయ విశ్లేషణలకు అనుగుణంగా కక్షలోకి దూసుకుపోయింది. వాహకనౌక 524 కిలోమీటర్ల వరకూ ప్రయా ణించి ఉపగ్రహాలను వాటి నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలలో మూడు స్వదేశీ ఉపగ్రహాలు, ఏకంగా 101 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. అమెరికాకు చెందిన 96 శాటిలైట్లను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇక భారతదేశపు వాతావరణ పరిశోధన పరిశీలక ప్రతిష్టాత్మక కార్టోశాట్ -2 శాటిలైట్‌ను తరువాత ఐఎన్‌ఎస్ 1 ఎ, తరువాత ఐఎన్‌ఎస్ 1 బిని విజయవంతంగా వాటి స్థానాలలోకి పంపించింది. తరువాత అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలను, ఇజ్రాయెల్, కజికిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎఇ కి చెందిన ఉపగ్రహాలను ఒక్కొక్కటి చొప్పున వాటిని కక్షలోకి విజయ వంతంగా ప్రవేశపెట్టారు. పదికిలోల బరువుకు తక్కువగా ఉండే 96 విదేశీ నానో ఉపగ్రహాలలో రెండు అమెరికా కంపెనీలకు చెందినవి కూడా ఉన్నా యి. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు మారిషస్‌లోని ఇస్రో కేంద్రానికి తొలి సంకేతాలు అందాయి. ఇస్రోకు ఇది 38వ వరుస విజ యంగా నమోదయింది. అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన తరువాత 30 నిమిషాల తరువాత అవి నిర్ణీత కక్షలోకి చేరిన దశలో అరగంట వ్యవధి తరువాత శాటిలైట్స్‌ను వాటి కక్షల్లోకి ఇస్రో ప్రవేశపెట్టిందని శాస్త్రజ్ఞులు తెలిపారు. 104 ఉపగ్రహాల మొత్తం బరువు 1378 కిలోలతో పిఎస్‌ఎల్‌వి నింగిలోకి దూసుకుపోవడమే కాకుండా కొత్త చరిత్రను సృష్టించడం కీలకంగా మారింది. ఇప్పటి ఈ రికార్డు స్థాయి ప్రయోగం తో భారతదేశం రష్యాను అధిగమించింది. 2014లో రష్యా ఏకకాలంలో 37 శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించింది. 2015లో ఇస్రో ఒకేసారి 20 శాటిలైట్లను ప్రయోగించింది. తరువాత ఒకేసారి 104 శాటిలైట్ల ప్రయోగపు విశిష్ట రికార్డు ద్వారా అత్యంత విలువైన అంతర్జాతీయ అంత రిక్ష ప్రయోగాల వాణిజ్య ప్రక్రియలో శ్రమకు తగ్గ ఫలం దక్కించుకుంది.
అంతా ఓకే అన్న ఇస్రో ఛైర్మన్
అనుకున్నది అనుకున్నట్లుగా ఏకకాలంలో 104 శాటిలైట్లను కక్షలోకి విజయవంతంగా ప్రయోగించినట్లు ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం తరువాత ఇస్రో ఛైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ ప్రకటించారు. ప్రయోగ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొన్న దశలో ఇస్రో ఛైర్మన్ తమ శాస్త్రజ్ఞుల టీంను అభినందించారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలి యచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగం సంపూర్ణ విజయం సాధించడంతో వెల్లివిరిసిన సంతోషం ఆయన ముఖంలో ద్యోతకం అయింది.
కార్టోశాట్‌తో తీర ప్రాంత వినియోగం
ఐదు సంవత్సరాలు పనిచేసే సామర్థం ఉన్న కార్టోశాట్ పలు కీలక వాతా వరణ పరిశోధనలకు దోహదం చేస్తుంది. ప్రత్యేకించి తీర ప్రాంత భూముల వినయోగం, వాటిని సక్రమరీతిలోకి తెచ్చే విధానాల గురించి సరైన గణాంకాలను అందిస్తుంది. రహదారి వ్యవస్థ అనుసంధానం, జలాల పంపకం, ల్యాండ్ మ్యాప్‌ల తయారీ వంటివి పలు ప్రయోజనకర చర్యలతో ఉపగ్రహం సేవలు అందిస్తుంది. అన్ని ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశపెట్టడం ఇస్రో విజయపథానికి సంకేతం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles