Thursday, February 22, 2024

పౌరసత్వ భంగాన్ని నిరూపిస్తారా?

- Advertisement -
- Advertisement -

Citizenship

 

రాహుల్, మమతలకు అమిత్ షా సవాల్

జబల్పూరు : నూతన పౌరచట్టంపై రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు హోం మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. ఈ నేతలు పౌరసత్వ చట్టం తప్పని నిరూపిస్తారా? ఏ ఒక్కరి పౌరసత్వాన్ని అయినా హరిస్తుందని నిరూపిస్తారా? అని షా ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్‌లోని బబల్పూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పౌరసత్వానికి భంగకరమైన ఒక్క నిబంధన అయినా ఈ చట్టంలో ఉందా? ఉంటే నిర్థిష్టంగా తెలియచేయాలని సూచించారు. మతం ప్రాతిపదికన పౌరసత్వ కల్పన జరిగే ఈ చట్టం సముచితం కాదని కాంగ్రెస్ నేత రాహుల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఈ చట్టంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

సిఎఎ, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) వంటివాటిని ఏకకాలంలో తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం భారతీయ ముస్లింలకు చేటు కల్గిస్తున్నాయని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల వాదనలో నిజం లేదని, కేవలం ఇతర దేశాలలో వేధింపులకు గురవుతున్న మైనార్టీలను ఆదుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చామని అమిత్ షా వారి వాదనను తిప్పికొట్టారు. పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్ శరణార్థులందరికీ ఇక్కడి పౌరసత్వం కల్పించే వరకూ కేంద్రం ఊరుకోబోదని హోం మంత్రి స్పష్టం చేశారు. నూతన పౌరసత్వ చట్టం ఈ నెల పదవ తేదీనుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ వెలువరించింది.

Proves Citizenship Disturbance?
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News