Saturday, April 20, 2024

అఫ్ఘన్‌కు తక్షణ మానవతా సహాయం అందించాలి

- Advertisement -
- Advertisement -
Provide immediate humanitarian assistance to Afghan
భారత్‌ ఐదు మధ్యఆసియా దేశాలు

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ ప్రజలకు తక్షణ మానవతా సహాయం అందించాల్సి ఉన్నదని భారత్, ఐదు మధ్య ఆసియా దేశాలు స్పష్టం చేశాయి. అయితే, అఫ్ఘన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సహాయం, శిక్షణలాంటివి అందకూడదని తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 2593 తీర్మానంలోనూ పేర్కొన్నారని గుర్తు చేశాయి. ఆదివారం భారత్‌మధ్యఆసియా దేశాల విదేశాంగమంత్రుల మధ్య మూడోదఫా చర్చల సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేశాయి. భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కజకిస్థాన్,కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, టర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల విదేశాంగమంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News