Home తాజా వార్తలు గర్భిణీలకు పోషకాహారం అందించాలి : డా. అపర్ణ

గర్భిణీలకు పోషకాహారం అందించాలి : డా. అపర్ణ

Provide nutrition to pregnant women says Dr. Aparna

 

హైదరాబాద్ : ప్రతి సంవత్సరం 15మిలియన్లకు పైగా పిల్లలు పూర్తి నెలల నిండకుండానే జన్మిస్తున్నారు. గర్భం 37వారాల కన్నా తక్కువని, జన్మించిన 10 మంది శిశువులలో ఒకరి కంటే ఎక్కువ మందికి జరుగుతుందని కిమ్స్ ఆసుపత్రి నియోనాటోలాజిస్ట్ డా. అపర్ణ పేర్కొన్నారు. ప్రపంచ ప్రీమెచ్యూరిటీ సందర్బంగా మాట్లాడుతూ వారిలో ముందుస్తు జననాలతో, పుట్టుక సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం 1 మిలియన్ పిల్లలు మరణిస్తున్నట్లు చెప్పారు. అనేక దేశాలలో ముందుస్తు జననాల నిష్పత్తి పెరుగుతోందని వివధ సర్వేల గణాంకాలు వెల్లడిస్తున్నాటు వివరించారు.

నవజాత శిశువులో మరణాలకు ప్రధాన కారణం ప్రీమెచ్యూరిటీ, బాల్య మరణాలకు రెండవ అతి ముఖ్యకారణమన్నారు. ముందస్తు జననాలను పరిష్కరించకుండా మెరుగైన పిల్లల జీవన మనుగడ, ఆరోగ్యవంతమైన జీవన పురోగతి సాధించటం అసాధ్యమన్నారు. ఈసందర్భంగా ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గర్భిణీలందరికి పూర్వజన్మ సంరక్షణ ఉండేలా చూసుకోవాలని, పోషకాహార మద్దతు, సలహా అవసరం, ముందుస్తు జననానికి ఎక్కువ ప్రమాదం ఉన్న గర్భిణీలను పరీక్షించడం,చూసుకోవాలన్నారు.ప్రసవాల నిర్వహణ, ముఖ్యంగా ముందుస్తు జన్మించిన శిశువులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటెనాటల్ కార్టికోస్టెరాయిడ్స్ అందించాలన్నారు.