Home తాజా వార్తలు రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించిన ఘనత కెసిఆర్‌దే

రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించిన ఘనత కెసిఆర్‌దే

KCR

 

పేదింటి ఆడపిల్లల కుటుంబాల్లో కళ్యాణ లక్ష్మితో ఆనందం
చెక్కుల పంపిణిలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

పెద్దకొత్తపల్లి : రైతులకు సబ్సీడి విత్తనాలు, నిరుపేదల ఆడప్లిలల పెళ్ళీలకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ది అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తపేట గ్రామంలో రైతులకు సింగిల్ విండో ద్వారా సబ్సీడి వేరుశనగ విత్తనాల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా తెలంగాణ ప్రభుత్వం సబ్సీడి వేరుశనగ విత్తనాలను మన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్నారని ఆయన అన్నారు. సబ్సీడి వేరుశనగను దళారులకు ఇవ్వకుండా అసలైన రైతులకు ఇవ్వాలని సూచించారు. దళారులకు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను 41 మంది లబ్ధ్దిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే ద ఇండ్లలో ఆడపడుచుల పెళ్ళిలు చేస్తే ఆర్థిక సహాయం అందించేందుకే కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మేకల గౌరమ్మ, సింగిల్‌విండో చైర్మన్ మహేశ్వరమ్మ, వ్యవసాయ అధికారి రజియా బేగం, తహసీల్దార్ దా నయ్య, మాజీ జడ్పీటిసి రాజేందర్ గౌడ్, సింగారం వెంకట య్య, మాజీ ఎంపిపి శ్రీనివాసులు, ఎంపిటిసిలు రేణుక, ప్ర తాప్ రెడ్డి, చంద్రయ్య, రవినాయక్, రాజు, రాజశేఖర్, లిం గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

providing Subsidized Seeds credit goes to KCR