Saturday, April 20, 2024

అభిమానులకు గుడ్ న్యూస్.. పవన్ ‘ఫస్ట్ లుక్’ లోడింగ్..

- Advertisement -
- Advertisement -

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతూ మళ్లీ బిజీ అవ్వడంతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ మూవీ ‘పింక్’ తెలుగు రిమేక్ లో నటిస్తున్నాడు. పవన్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’, ‘లాయర్ సాబ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పవన్ లుక్, ఓ డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయి హల్ చల్ చేస్తున్న విషయం తెలిపిందే. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్, పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తామని ప్రకటించాడు. తాజా సమాచారం మేరకు.. మార్చి 2న పవన్‌ ఫస్ట్‌లుక్‌‌ను, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్ సింగిల్‌ను చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో #PSPK26 FirstLook అనే హ్యాష్ ట్యాగ్ ట్వీట్టర్ లో ట్రెంగిండ్ అవుతోంది. కాగా, స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజ్, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి ఎంసిఎ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

#PSPK26 First Look Hashtag Trending on Twitter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News